• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

4వ వార్డులో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

WNP: భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి సోమా రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ వద్ద పాత ట్రాన్స్ ఫార్మర్ సమస్యను పరిష్కరిస్తూ నూతన ట్రాన్స్ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. 4వ వార్డు కౌన్సిలర్ నాయిని అరుణ పూర్ణచందర్ చొరవతో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్           చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

March 3, 2026 / 10:11 AM IST

విద్యార్థులు అలెర్ట్.. నోటిఫికేషన్ విడుదల

KNR: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు.వ అపరాధ రుసుం లేకుండా మార్చి 13 వరకు, రూ.300 ఆలస్య రుసుముతో మార్చి 18 వరకు ఫీజు చెల్లించవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్సైట్ చూడాలన్నారు

March 3, 2026 / 10:11 AM IST

కాలం ఒడిలో కవితా సంకలనం ఆవిష్కరణ

JGL: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవయిత్రి, రుద్రమ సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షురాలు డా. చిందం సునీత రచించిన  కాలం ఒడిలో  కవితా సంకలనాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యా వేత్త, రచయిత ఎంవీ నరసింహారెడ్డికి ఈ కవితా సంకలనాన్ని అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా కవయిత్రిని కళాశ్రీ అధినేత గుండేటి రాజు, పలువురు అభినందించారు.

March 3, 2026 / 10:11 AM IST

100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం: DMHO

BHPL: జిల్లా వైద్య కార్యాలయంలో సోమవారం సాయంత్రం DMHO డా.మధుసూదన్ ఆధ్వర్యంలో RBSK వైద్యాధికారులు, జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ నెల 4 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు.

March 3, 2026 / 10:10 AM IST

కేతకిలో సంగమేశ్వర గుడి తలుపులు ముసివేత

SRD: కేతుగ్రస్తు చంద్రగ్రహణం సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. ఇవాళ మబ్బున 5 గంటలకు పార్వతి సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మంగళ హారతులు ఇచ్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే ప్రస్తుతం భక్తుల దర్శనాలు నిలిపివేశామన్నారు. ఆలయ సిబ్బంది ఉన్నారు.

March 3, 2026 / 10:10 AM IST

ప్రియుడిని చంపిన నటి.. అరెస్ట్

తన ప్రియుడు మోహనకృష్ణ (45)ను హత్య చేయించిన కేసులో నటి ఊర్వశి బెంగళూరులో అరెస్టయ్యింది. వినయ్ అనే మరో వ్యక్తితో ప్రేమలో పడ్డ ఆమె, పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో మోహనకృష్ణను కత్తితో పొడిచి చంపించింది. భర్తకు దూరంగా ఉంటున్న ఊర్వశి పలు కన్నడ చిత్రాల్లో నటించింది. ఈ క్రూరమైన పథకంలో ఆమెకు సహకరించిన వినయ్, మరో యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

March 3, 2026 / 10:10 AM IST

‘రెవెన్యూ క్లినిక్‌లతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం’

సత్యసాయి: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో ‘రెవెన్యూ క్లినిక్స్’ కార్యక్రమం ద్వారా భూ సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నారు. తహసీల్దార్‌లు, ఆర్డీవోలు ఒకేచోట రికార్డులను పరిశీలిస్తూ అడంగల్ మార్పులు, మ్యుటేషన్లు, వారసత్వ నమోదు పనులు పూర్తి చేస్తున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నారు.

March 3, 2026 / 10:08 AM IST

వినతులు తగ్గేలా చర్యలు తీసుకోవాలి: జే.సీ

PPM: రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిన వినతులను తక్షణమే పరిష్కరించాలని పార్వతి పురం మన్యం జిల్లా ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తహసీల్దార్లను ఆదేశించారు. మండలం స్థాయిలో గ్రీవెన్స్ తగ్గేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ అంశాలు, వివిధ వినతుల పురోగతిపై తహసీల్దార్లతో ఆయన ఛాంబర్‌లో సమీక్షించారు.

March 3, 2026 / 10:08 AM IST

చెట్టుపై ఎలుగుబంటి పిల్ల.. భయాందోళనలో గ్రామస్తులు

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బర్రివాని తోటలో మునగ చెట్టుపై ఎలుగుబంటి పిల్ల కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. రాత్రి సమయంలో కుక్కలు అరవటంతో మేల్కొన్న గ్రామస్తులు ఎలుగుబంటి పిల్లని గమనించారు. తల్లి ఎలుగుబంటి సమీపంలోనే ఉండే అవకాశం ఉందని, గతంలో ఎలుగుబంటి దాడుల్లో ఇద్దరు మరణించారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 3, 2026 / 10:07 AM IST

లీగల్ ఎయిడ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

KMR: సైబర్ నేరాల బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు తిరిగి నగదు పొందెందుకు తక్షణ సహాయం అందించేందుకు లీగల్ ఎయిడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. బాధితులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 లేదా సమీప పోలీస్ స్టేషన్, లేదా జిల్లా సైబర్ క్రైమ్ సెల్‌ను సంప్రదించాలన్నారు.

March 3, 2026 / 10:07 AM IST

దారుణ హత్య.. వ్యక్తిని గొంతుకోసి చంపిన దుండగులు

AP: అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముంచంగిపుట్టులో నాగేశ్వరరావు అనే వ్యక్తిని దుండగులు గొంతుకోసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, కొన్నాళ్లుగా మహిళతో నాగేశ్వరరావు సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.

March 3, 2026 / 10:07 AM IST

‘బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం’

NRML: బాల్య వివాహాలను నిర్మూలించేందుకు జిల్లాలోని అన్ని గ్రామాలు, విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 18 సంవత్సరాలలోపు బాలికలకు, 21 సంవత్సరాలలోపు బాలురకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలు పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.

March 3, 2026 / 10:06 AM IST

విద్యార్థులకు అరుదైన అవకాశం

NLG: దేశ భవిష్యత్తును నిర్దేశించే ప్రణాళికల్లో యువతను భాగస్వాములను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు NG కళాశాలను నోడల్ కేంద్రంగా ఎంపిక చేశారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 4లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

March 3, 2026 / 10:04 AM IST

‘వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత’

MDK: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని తూప్రాన్ ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా తూప్రాన్ మండలం లింగారెడ్డిపల్లిలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అగ్ని ప్రమాదాల వల్ల వన్యప్రాణులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

March 3, 2026 / 10:02 AM IST

ప్రముఖ నటుడి ఇంట విషాదం

టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, బి. రామరాజు(85) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇవాళ ఉదయం మధురానగర్‌లోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో రామరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

March 3, 2026 / 10:01 AM IST