• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అమరవీరుల త్యాగాలను మర్చిపోలేం: సునీల్ మాదిగ

KMM: ప్రజా సమస్యల పోరాటంలో అమరవీరుల త్యాగాలను మర్చిపోలేని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ అన్నారు. మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం మధిరలో మాదిగ అమరవీరుల చిత్రపటానికి నివాళులర్పించారు. మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ పోరులో అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవాలని చెప్పారు.

March 1, 2026 / 12:47 PM IST

పారా బాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలకు ముగ్గురు ఎంపిక

విజయనగరం: పారా బాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని ఆదివారం పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. మార్చి 6 నుండి 10 వరకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలో జాతీయ స్థాయి పోటీలు జరుగనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటి జిల్లాకు, రాష్ట్రానికీ మరింత పేరు తేవాలన్నారు.

March 1, 2026 / 12:46 PM IST

‘ఎంత దోచుకుంటే కాంగ్రెస్‌కు వెయ్యి కోట్లు ఇస్తారు’

TG: కాంగ్రెస్ పార్టీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని సీఎం రేవంత్ చెబుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్ని వేల కోట్లు దోచుకుంటే వెయ్యి కోట్లు ఇస్తారో అర్థం చేసుకోవాలని తెలిపారు. డీపీఆర్ లేని ప్రాజెక్ట్ కోసం సామాన్యుల ఇళ్లు కూల్చేయడం ఏంటని నిలదీశారు. మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్ నిలబడుతుందని స్పష్టం చేశారు.

March 1, 2026 / 12:45 PM IST

రేపటి నుంచి టెన్త్ విద్యార్థులకు గ్రాండ్ టెస్టులు ప్రారంభం

ATP: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి గ్రాండ్ టెస్టులు మొదలవుతాయని డీఈవో ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం తెలుగు, బుధవారం హిందీ, గురువారం ఇంగ్లీష్, శుక్రవారం లెక్కలు, శనివారం భౌతిక శాస్త్రం, సోమవారం జీవశాస్త్రం, మంగళవారం సోషల్, పరీక్షలు ఉంటాయన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1.30గంటల నుంచి 4.45 వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు.

March 1, 2026 / 12:43 PM IST

సెమీ ఫైనల్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన అదనపు DCP

HNK: కాకతీయ యూనివర్సిటీలో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెమీ ఫైనల్ క్రికెట్ పోటీలను ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ ప్రారంభించారు. క్రీడలతోనూ మానసిక ఉల్లాసం లభిస్తుందని, క్రీడలు క్రీడాకారుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడతాయి అన్నారు. కేయూ సీఐ రవికుమార్, ఏబీఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మంద నరేష్, క్రీడాకారులు ఉన్నారు.

March 1, 2026 / 12:43 PM IST

చెరువులో పడి యువకుడు మృతి

KNR: పొలం పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గాజుల రాజేశ్ (36) శనివారం సాయంత్రం పొలానికి వెళ్లి రాత్రి వరకూ తిరిగి రాలేదు. ఆందోళనతో వెతికిన కుటుంబ సభ్యులకు చెరువులో మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య రజిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

March 1, 2026 / 12:41 PM IST

మోడల్ స్కూల్ టీచర్ అనుమానస్పద మృతి

RR: ఉప్పల్ చిలుకానగర్‌కు చెందిన సతీష్ కుమార్ ఆరుట్ల మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నంలోని అద్దె ఇంటి బాత్రూంలో విగతజీవిగా పడి ఉన్న అతడిని ఇబ్రహీంపట్నం మార్చురికి పోలీసులు తరలించారు. మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

March 1, 2026 / 12:40 PM IST

కాలనీల సమస్యలకు నిధులు కేటాయిస్తాం : ఎమ్మెల్యే

SRD: కాలనీలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి త్వరలో నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ముత్తంగి డివిజన్ పోచారం పరిధిలోని మహిధర లగ్జూరియా కాలనీలో శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణ పనుల కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

March 1, 2026 / 12:39 PM IST

రంగుల పూసలతో ప్రాణం పోస్తున్న కళాఖండాలు

సూది, దారం, పూసలతో వస్త్రాలపై ఎంబ్రాయిడరీ చేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, కేవలం పూసలను దారానికి గుచ్చుతూ, మనుషుల ముఖచిత్రాలను అచ్చుగుద్దినట్లు సృష్టించడం గొప్ప కళా నైపుణ్యం. ఈ బీడ్స్ ఆర్టిస్టులు పూసల రంగుల కలయికతో ఫొటోలోని వ్యక్తుల పోలికలు ఏమాత్రం మారకుండా ప్రాణం పోస్తున్నారు. వీరి అద్భుతమైన కళాఖండాలను చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

March 1, 2026 / 12:38 PM IST

‘మూసీ సుందరీకరణ ముఖ్యమే.. విధ్వంసం వద్దు’

TG: హైదరాబాద్ గంధంగూడలోని మూసీ బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చిందని తెలిపారు. అలాంటిది ప్రభుత్వమే ఇళ్ల కూల్చివేతకు దిగడం దారుణమన్నారు. మూసీ సుందరీకరణ ముఖ్యమేనని.. కానీ విధ్వంసం వద్దని సూచించారు. మూసీ సుందరీకరణ కోసం జనం కాంగ్రెస్‌కు ఓట్లు వేయలేదని స్పష్టం చేశారు.

March 1, 2026 / 12:38 PM IST

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన TPCC ప్రచార కమిటీ ఛైర్మన్

MNCL: బెల్లంపల్లి మండలం దుగ్నపల్లి గ్రామపంచాయతీలో గ్రామపంచాయతీ స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TPCC రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ నాథరి స్వామి హాజరై ప్రారంభించారు. స్వామి మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు బానీసలు కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపాలని సూచించారు.

March 1, 2026 / 12:37 PM IST

వందన మల్లేశ్వర స్వామికి కళ్యాణోత్సవం

CTR: పలమనేరు రూరల్ మండలంలోని జగమర్ల పంచాయతీ దేవలంపేట నందున్న శ్రీ వందన మల్లేశ్వర స్వామి దేవాలయం నందు త్రయోదశి ఆదివారం శ్రీపార్వతి వందన మల్లేశ్వర స్వామికి అత్యంత ఘనంగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఆది దంపతుల కళ్యాణోత్సవం కన్నుల విందుగా తిలకించిన అశేషమైన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

March 1, 2026 / 12:36 PM IST

దర్శిలో మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభం

ప్రకాశం: దర్శి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్‌ను కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు.

March 1, 2026 / 12:36 PM IST

TG ఉద్యమకారుల జిల్లా అధ్యక్షుడిగా సంజీవ

VKB: బషీరాబాద్ మండలం రెడ్డిఘనపూర్‌కు చెందిన సంజీవ గౌడ్ కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయనను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడిగా నియమించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తనను గుర్తించి బాధ్యతలు అప్పగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవ గౌడ్ నియామకం పట్ల పలువురు ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 1, 2026 / 12:35 PM IST

నేటి నుంచి రేషన్ సరుకులు పంపిణీ: జేసీ

ATP: జిల్లాలో ఆదివారం నుంచి ఈనెల 15 వరకు చౌక ధరల దుకాణాలలో సరుకులు పంపిణీ చేస్తారని జేసీ విష్ణు చరణ్ తెలిపారు. జిల్లాలోని 6,74,333 రేషన్ కార్డులకు సరిపడా నిత్యవసర సరుకులు చౌక ధరల దుకాణాలకు సరఫరా చేసామన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు సరుకులు పంపిణీ చేస్తారన్నారు.

March 1, 2026 / 12:35 PM IST