VZM: చీపురుపల్లిలో జరుగతున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది అమ్మవారి చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు.
ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్‌ను మంగళవారం రాంనగర్ గ్రామస్థులు మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. అందరం కలిసి కట్టుగా గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.
ASF: రెబ్బెన మండలం గోలేటిలో గతంలో జరిగిన RTC బస్ ఆక్సిడెంట్‌లో RTC డ్రైవర్ రామారావుకు సంబంధం లేకున్న బాధ్యులుగా చూపించి రిమాండ్‌కు పంపించారని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆసిఫాబాద్ బస్టాండ్ ఎదుట బాధిత కుటుంబ సభ్యులతో బైఠాయించి ధర్నా నిర్వహించారు. రామారావుపై పెట్టిన కేసు ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవాలన్నారు.
SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కీర్తిశేషులు ముత్యం వెంకటేష్ జ్ఞాపకార్థం ముత్యం మల్లయ్య, ముత్యం ప్రశాంత్ గౌడ్ కెమెరాలు అందజేశారు. సర్పంచ్ ఎం. రాజు, ఎస్సై సిరిసిల్ల అశోక్ ప్రారంభించారు. గ్రామస్తులు దాత కుటుంబాన్ని అభినందించారు.
MNCL: లక్షెట్టీపేట మండలంలోని తిమ్మాపూర్లో ఉన్న ప్రభుత్వ నర్సరీని స్థానిక ఎంపీడీవో సరోజ సందర్శించారు. మంగళవారం ఆమె తిమ్మాపూర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. మొదట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను తప్పులు రాకుండా చూడాలన్నారు. నర్సరీని సందర్శించి నిర్వాహకులకు సూచనలు చేశారు.
GDWL: జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో పెండింగ్ ఆయకట్టు భూ సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
BPT: వైద్య ఖర్చుల వల్ల ఏ పేదవాడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నేత అనగాని శివప్రసాద్ అన్నారు. రేపల్లెలో మంగళవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో మంజూరైన రూ.19,09,257 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీలను 29 మంది లబ్ధిదారులకు ఆయన అందజేశారు. సీఎం చంద్రబాబు సంకల్పంతో అర్హులందరికీ సకాలంలో వైద్య సాయం అందుతోందన్నారు.
CTR: మెరుగైన ఉపాధి కోసం విజయపురం(మం) పన్నూరు సబ్‌స్టేషన్ నందు గల ప్రభుత్వ ఐటీఐ నందు చేరాలని ట్రైనింగ్ అధికారి మునికృష్ణయ్య పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థులకు కేరియర్ గైడెన్స్ అవగాహన నిర్వహించారు. రెండు సంవత్సరాలు, ఒక సంవత్సరం కోర్సుసు కలవని అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారి మురళి పేర్కొన్నారు.
ఇటలీ మహిళా క్రికెట్ జట్టు కోఆర్డినేటర్ ప్రభాత్ ఏక్నెలిగోడ (57)పై ఈ ఆరోపణలు వచ్చాయి. ఓ మహిళా క్రీడాకారిణిని, శిక్షణ సమయంలో మోకాలి గాయానికి మసాజ్ చేస్తున్న నెపంతో ఆయన అసభ్యంగా తాకినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు మార్చి 2025లో రోమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇప్పుడు 2026 T20 WCలో ఇటలీ అరంగేట్రం చేయడంతో ఈ వార్త మరోసారి చర్చనీయాంశంగా మారింది.
కడప: జిల్లా యువతకు నైపుణ్య వేదికగా నిలవనున్న ‘స్టార్ట్ అప్ కడప’ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్షించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో పనుల వేగం, నాణ్యతపై సూచనలు ఇచ్చారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని నిర్మాణ ప్రాంగణాన్ని పరిశీలించారు.
సత్యసాయి: కదిరి మండలం యాకలచెరువుపల్లిలో YCP కార్యకర్తలపై జరిగిన దాడిని నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన గ్రామాన్ని సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం బాధితులతో కలిసి కదిరి డీఎస్పీ శివ నారాయణ స్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మక్బూల్ డిమాండ్ చేశారు.
AP: అనంతపురంలో ఫేస్‌బుక్ పోస్టులతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఓ కానిస్టేబుల్ భార్య ఫేస్‌బుక్‌లో కొన్ని పోస్టులు చేశారు. ఆమె పోస్టుల కింద మరో కానిస్టేబుల్ అసభ్య మెసేజ్‌లు పెట్టాడు. వీటిని భర్త చూడడంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. అనంతరం భార్యతో భర్త ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనతో ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
KMR: బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్పష్టం చేశారు. మంగళవారం పిట్లంలో ఆయన మాట్లాడూతూ.. నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. MLA లక్ష్మీకాంతరావు కమిషన్ల కోసం ఒత్తిడి చేయడం వల్లే పనులు ఆగిపోయాయన్నారు.
SDPT: కోహెడ మండలంలో వేరుశనగ పంట ఫీల్డ్ ఎంపిక కార్యక్రమాన్ని ఏఎస్‌వో చామంతి నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో పంట చేనులను పరిశీలించి వేరుశనగ పంట స్థితిగతులను అధ్యయనం చేశారు. రైతులకు సాగు విధానాలు, తెగుళ్ల నివారణ చర్యలు, దిగుబడి పెంపు మార్గాలపై సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంటల ఎంపిక, నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని రైతులకు సూచించారు.
SKLM: జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి 18 మంది ప్రజలు ఆసుపత్రి పాలు కావడానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రహదారి మరమ్మతు పనులతో తాగునీరు కలుషితమవుతుందని తెలిసినా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.