SKLM: గ్రామస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని కూడా ఛైర్మన్ కొరికానా రవికుమార్ కోరారు. శుక్రవారం మెలియాపుట్టి మండలంలోని చాపర కళ్యాణమండపంలో జనసేన సభ్యత్వాల గూర్చి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామాలలో పర్యటించి జనసేన సభ్యత్వాలు చేయించాలని సూచించారు. ఆయనతోపాటు జనసేన నాయకురాలు కొరీకాన భవాని ఉన్నారు.
AKP: మాడుగుల మండలం జాలంపల్లి పంచాయతీ కొండవీటి, కామకోటం గ్రామాల్లో జీడి రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. జీడిపిక్కకు కేజీ రూ.200 ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీడి పిక్కలు 80 కేజీల బస్తా రూ.18వేలకు మద్దతు ప్రకటించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా జీడి తోటల అభివృద్ధి చేయాలన్నారు.
AKP: నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఇంటి పన్నుల వసూళ్లలో 80 శాతంతో నక్కపల్లి మండలం మొదటి స్థానంలో ఉన్నట్లు డీఎల్డీవో నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం కోటవురట్లలో ఇంటి పన్నుల వసూళ్లపై ఎంపీడీవో చంద్రశేఖర్‌తో కలిసి స్పెషల్ నిర్వహించారు. మార్చి 15 లోగా శత శాతం ఇంటి పనులు వసూళ్లు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
నెల్లూరుకు చెందిన ప్రముఖ డాక్టర్ ప్రత్యూష రెడ్డి టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరానన్నారు. ఆమెకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తన మాట నమ్మి పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్త, నాయకుడిని గౌరవంగా చూసుకునే బాధ్యత తనదేనని కోటంరెడ్డి చెప్పారు.
TPT: రేణిగుంట మండలం అడుసుపాలెం జగనన్న లేఅవుట్‌లో గుర్తుతెలియని మహిళ మృత చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిర్మాణంలో ఉన్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గాజులమండ్యం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ ఉరివేసుకుని మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మీరు చేసే ప్రతి పెద్ద లావాదేవీపై ఆదాయపు పన్ను శాఖ నిఘా ఉంటుంది. బ్యాంక్ డిపాజిట్లు, ఎఫ్డీలు, రియల్ ఎస్టేట్ కొనుగోళ్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు వంటివి పరిమితి దాటితే బ్యాంకులు ఐటీ శాఖకు సమాచారం ఇస్తాయి. మీ ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకపోతే ఐటీ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండి, రిటర్న్స్ సక్రమంగా దాఖలు చేయడం మంచిది.
వనపర్తి జిల్లా నూతన అదనపు కలెక్టర్‌గా ఖీమ్యా నాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా స్థానిక సంస్థల పనితీరును మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అమలులో పారదర్శకత ఉండేలా కృషి చేస్తానని చెప్పారు.
AP: శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో హైదరాబాద్‌కు బొత్సను తరలించారు. సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రే ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ గ్రీవెన్స్ సెల్ నోడల్ ఆఫీసర్గా డాక్టర్ యస్. రవికుమార్ నియమితులయ్యారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేశ్ బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు, సిబ్బంది సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈ నియామకం చేపట్టబడిందని యూనివర్సిటీ వెల్లడించింది. తోటి అధ్యాపకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.
NLR: మనుబోలులోని ప్రభుత్వ ఆసుపత్రిని DMHO సుజాత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యశాలలో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. తప్పనిసరిగా నెలకు 10 కాన్పులు చేయాలని సూచించారు. సీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ వచ్చేలా కృషి చేయాలన్నారు. సీహెచ్వో రాజయ్య, పీహెచ్ఎన్ జయలక్ష్మి పాల్గొన్నారు.
TG: MGBS బస్టాండ్‌లో ‘జీఐ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఇందులో మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. చేనేత, హస్తకళలకు చేయూతనిచ్చేలా జీఐ ఆన్ వీల్స్ పేరుతో బస్‌లపై ప్రచారం చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ కృషిని ఆయన అభినందించారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.0గా నమోదైంది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NRPT: ముదిరాజులను బీసీ డీ గ్రూపు నుండి బీసీఏ గ్రూపులోకి మార్చాలని పాలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్ అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. ప్రభుత్వం ముదిరాజులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చందు, మొగులప్ప, నారాయణ, చంద్రశేఖర్, పటేల్ శీను ఉన్నారు.
KDP: ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరం పాలకేంద్రాన్ని డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండ్రీ ఆఫీసర్ డాక్టర్ ఎన్ ఏ. శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాల కేంద్రంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాలు పాడవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల పరిధిలోని పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
AP: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏలూరు జిల్లా నూజివీడులోని కోర్టుకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాలకు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వద్దకు వచ్చిన పలువురు వైసీపీ కార్యకర్తలతో మాట్లాడారు.