• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జాతీయ స్థాయి క్రీడాకారులకు రామలింగారెడ్డి ఆర్థిక సాయం

ATP: షూటింగ్ బాల్ పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికైన సిద్ధరాంపురం విద్యార్థులు అభిలాష్, అంజలికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. తల్లిదండ్రులు లేకపోయినా అంజలి కనబరిచిన పట్టుదలను ఆయన అభినందించారు. ఆ విద్యార్థిని చదువుకు, భవిష్యత్తుకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

February 27, 2026 / 02:12 PM IST

రేపు మల్లంపేటలో ఉచిత వైద్య శిబిరం

కాకినాడ: రౌతులపూడి మండలం మల్లంపేటలో శనివారం ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. మమత ఆసుపత్రి, రాఘవ ఆసుపత్రి, పుష్ప ప్రాథమిక కంటి ఆసుపత్రులకు చెందిన వైద్య బృందం శిబిరంలో సేవలందిస్తుందని పేర్కొన్నారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.

February 27, 2026 / 02:12 PM IST

నేడు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్ష

NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జూనియర్ కళాశాలలో 302 విద్యార్థులకు గాను ముగ్గురు, ప్రభుత్వ ఆదర్శ కళాశాలలో 180 విద్యార్థులకు గాను ఒక్కరు గైర్హాజరైనట్లు GNC ప్రిన్సిపల్ శ్రీనాథ్, MJC ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు.

February 27, 2026 / 02:11 PM IST

చెట్టును ఢీకొన్న కారు.. నలుగురికి తీవ్ర గాయాలు

BHNG: మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామంలో మూల మలుపు వద్ద ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న స్విఫ్ట్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలవ్వగా.. పరిస్థితి విషమంగా ఉన్న ఒకరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు స్థానికులు పేర్కొన్నారు.

February 27, 2026 / 02:10 PM IST

గరుడ వారధి వద్ద ప్రమాదం.. వ్యక్తి మృతి

తిరుపతిలో గరుడ వారధి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి తాతయ్యగుంటకు చెందిన ద్వారక, తిరుచనూర్‌లో జరిగిన వివాహానికి వెళ్లి వస్తుండగా బ్లిస్ సర్కిల్ వద్ద బైక్ అదుపు తప్పి గరుడ వారధి గోడను ఢీ కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ద్వారక స్పాట్‌లోనే మృతి చెందాడు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్సై హేమాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 27, 2026 / 02:10 PM IST

‘ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి’

E.G: శాసనమండలిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వైసీపీ ఎమ్మెల్సీలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాజమండ్రిలో ర్యాలీ చేపట్టారు. శాసనసభలో ఒక సభ్యుడిపై ఇలాంటి దాడులకు దిగడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.

February 27, 2026 / 02:09 PM IST

గచ్చిబౌలి సెంట్రో మాల్ సమీపంలో కారు బ్రేక్ డౌన్

HYD: గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ వైపు సెంట్రో మాల్ సమీపంలో కారు బ్రేక్ డౌన్ కావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మందగించింది. పరిస్థితిని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పర్యవేక్షిస్తూ వాహనాన్ని తొలగించే చర్యలు చేపట్టింది. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించి ట్రాఫిక్ సిబ్బంది సూచనలు పాటించాలని, వీలైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని సూచించింది.

February 27, 2026 / 02:07 PM IST

సబడ్జెట్‌లో బద్వేల్‌కు నిధులు లేకపోవడం దుర్మార్గం’

KDP: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బద్వేల్ నియోజకవర్గానికి నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమని సీపీఐ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎస్. చంద్రశేఖర్ విమర్శించారు. బద్వేలులోని భగత్ సింగ్ నగర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమశిల వెనుక జలాల జీవోకు రూ.100 కోట్లు కేటాయించి గోపవరం, అట్లూరు, బద్వేల్ ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని డిమాండ్ చేశారు.

February 27, 2026 / 02:05 PM IST

బడ్జెట్‌లో బద్వేల్‌కు నిధులు లేకపోవడం దుర్మార్గం’

KDP: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బద్వేల్ నియోజకవర్గానికి నిధులు కేటాయించకపోవడం దుర్మార్గమని సీపీఐ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎస్. చంద్రశేఖర్ విమర్శించారు. బద్వేలులోని భగత్ సింగ్ నగర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమశిల వెనుక జలాల జీవోకు రూ.100 కోట్లు కేటాయించి గోపవరం, అట్లూరు, బద్వేల్ ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని డిమాండ్ చేశారు.

February 27, 2026 / 02:05 PM IST

ఉచిత సోలార్ యూనిట్ల ప్రారంబించిన కలెక్టర్

నంద్యాల పట్టణంలోని ఎన్జీవో కాలనీ, పొన్నాపురం ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ యోజన పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్న 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ యూనిట్ల స్థాపన పనులను జిల్లా కలెక్టర్ రాజకుమారి శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు విద్యుత్ భారం తగ్గి, ఆర్థికంగా మేలు చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు.

February 27, 2026 / 02:05 PM IST

నాని, సుజీత్ మూవీలో పృథ్వీరాజ్?

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబోలో ‘బ్లడీ రోమియో’ మూవీ తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పృథ్వీరాజ్ ‘వారణాసి’ మూవీతో బిజీగా ఉన్నాడు.

February 27, 2026 / 02:05 PM IST

మృతురాలికి నివాళులర్పించిన సీపీఎం నేతలు

NLG: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన రుద్రవరం పిచ్చమ్మకు ఇవాళ సీపీఎం నేతలు నివాళులర్పించారు. జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, బొబ్బలి సుధాకర్ రెడ్డి, చొప్పరి మల్లేశం, సరోజ, సంధ్యారాణి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

February 27, 2026 / 02:04 PM IST

రోడ్డు భద్రత ఉద్యమంపై విద్యార్థిలకు అవగాహన

సూర్యాపేట: ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు శుక్రవారం నేరేడుచర్ల పట్టణంలోని ప్రగతి హైస్కూల్లో రోడ్డు భద్రతపై ఎస్సై రవీందర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థి ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని, ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడప వద్దన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలన్నారు.

February 27, 2026 / 02:04 PM IST

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

ADB: నేరడిగొండ మండలంలోని లఖంపూర్ ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాలలో సైన్స్ ల్యాబ్, సిబ్బంది నివాస గృహాల నిర్మాణానికి ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎంపీ నగేష్‌తో కలిసి భూమిపూజ చేశారు. రూ. 80 లక్షలతో సిబ్బంది గృహాలు రూ. 21లక్షలతో సైన్స్ ల్యాబ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1

February 27, 2026 / 02:02 PM IST

ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు

 అన్నమయ్య: అన్ని ప్రైవేటు పాఠశాలలో 2026-27 సంవత్సరానికి గాను 2009 ప్రకారం 1వ తరగతిలో ఉచితంగా చేరెందుకు ప్రవేశాలకు ఫిబ్రవరి 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని రాజంపేట మండల విద్యాశాఖ అధికారులు రఘునాథరాజు, డి. సుబ్బరాయుడు తెలిపారు. ఈ మేరకు వారు రాజంపేట మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శుక్రవారం ఇందుకు సంబంధించిన ప్రచార పత్రాలను విడుదల చేశారు.

February 27, 2026 / 02:02 PM IST