W.G: రైల్వే ట్రాక్ మరమ్మతుల వల్ల ఇరగవరం మండలం రేలంగి నుంచి అత్తిలి వెళ్లే మార్గంలోని గవర్లపాలెం రైల్వే గేటును తాత్కాలికంగా మూసివేస్తున్నారు. గురువారం రాత్రి 7 గంటల నుంచి శనివారం రాత్రి 7 గంటల వరకు గేటు మూసి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని వారు సూచించారు.
HYD: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో గత 14 నెలల్లో పట్టుబడినవారి నుంచి ఏకంగా రూ. 14 కోట్ల జరిమానా వసూలైంది. ముఖ్యంగా SR నగర్ పరిధిలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, పట్టుబడిన ఉద్యోగుల వివరాలను వారి కార్యాలయాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ కాగా, నలుగురు ప్రైవేటు ఉద్యోగాలు కోల్పోయారు.
TG: హైదరాబాద్‌లోని నాగోల్ STPని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. గత BRS ప్రభుత్వ హయాంలో మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధి కోసం చేపట్టిన పనులను ఆయన ఇతర నేతలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్పట్లో తాము నిర్మించిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనితీరును వివరిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ మూసీ ప్రాజెక్టుపై విమర్శలు సంధించారు.
KMM: తల్లాడ మండల జాతీయ ప్రధాన రోడ్డుపై ఇరువైపులా ఉన్న సూచిక బోర్డులు అగమ్య గోచరంగా మారిందని స్థానికులు గురువారం తెలిపారు. ప్రయాణికులు ఎటు పోవాలో తెలుసుకోలేని సందిగ్ధలో పడుతున్నారని తెలిపారు. ఈ బోర్డు ద్వారా కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు ఒక దగ్గరికి వెళ్లిపోగా మరో దగ్గరికి మల్లుతున్నామని తెలిపారు. వెంటనే R&B అధికారులు
శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ మార్చి 6న థియేటర్లలోకి రాబోతుంది. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కేవలం 1 గంట 58 నిమిషాల తక్కువ రన్ టైంతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిన్న నిడివి ప్రేక్షకులను అబ్బురపరుస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. ఇక ఈ మూవీలో రెబా మోనికా జాన్ నటించగా, కాల భైరవ సంగీతం అందించారు.
ప్రకాశం: నడికుడి-కాళహస్తి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా పామూరు మండలంలో పనులు వేగంగా జరుగుతున్నాయని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ఇటీవల కనిగిరి వరకు పనులు పూర్తి చేసి ట్రైన్ ట్రయల్ కూడా విజయవంతంగా నిర్వహించారు. వచ్చే ఏడాది నాటికి పామూరు వరకు నిర్మాణాలు పూర్తి చేయించి రైలు నడిపిస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.
కడప: చాపాడు మండల కేంద్రంలో ఎంపీడీవోగా పనిచేస్తున్న వీర కిషోర్ బదిలీ కావడంతో, కాజీపేట ఎంపీడీవో దివిజ సంపతీ బుధవారం ఉదయం చాపాడు ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చాపాడు మండల TDP అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి నూతన ఎంపీడీవో దివిజ సంపతీని స్వాగతించి, మండల అభివృద్ధి, సమస్యలపై చర్చించారు.
VZM: సత్య కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రేణుకా శ్రీ కరణి ఆంధ్రా యూనివర్సిటీ గేమ్స్, స్పోర్ట్స్ 2025-26 పోటీల్లో తైక్వాండో విభాగంలో ప్రథమ స్థానం సాధించింది. ఈ విజయంతో ఆమె ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ (జాతీయ స్థాయి పోటీలు)కి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల సంచాలకులు డా. ఎం.శశిభూషణ రావు విద్యార్తిని అభినందించారు.
ATP: అనంతగిరిలో జరిగిన ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ శిక్షణ ముగిసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నూతన డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన పది రోజుల శిక్షణలో అనంతపురం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఇమామ్ వలి విజయవంతంగా పూర్తి చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ కార్యదర్శుల నుంచి ఆయన శిక్షణా పత్రం, రాట్నం కిట్ అందుకున్నారు.
VKB: కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 11, 1 వార్డుల్లోని బస్తీ దవాఖానాలను మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్, కమిషనర్ బలరామ్ నాయక్ తనిఖీ చేశారు. రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలలుగా హాజరు రిజిస్టర్ లేకుండా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా డీఎంహెచ్‌వో, డిప్యూటీ డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు.
E.G: జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా మార్చి 6 నుంచి 8 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన రాజమండ్రి చేరుకుంటారని… శనివారం ఎస్సీల సంక్షేమం, రక్షణాత్మక చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం కోనసీమ జిల్లాకు వెళ్తారని వివరించారు.
NZB: వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 47 గ్రాముల చరాస్, 29 గ్రాముల గంజాయి, ఒక బైక్, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో భీంగల్‌కు చెందిన అఖిల్, సోహైల్‌తో పాటు నాందేడ్‌కు చెందిన వ్యక్తి, వేల్పూరు చెందిన మైనర్ ఉన్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.
AP: విశాఖలో వైసీపీ కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనపై దాడి చేసి అక్రమంగా జైలుకు పంపారని మాజీమంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దాడి చేసి కార్లు ధ్వంసం చేశారని అన్నారు. తనను చంపేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా కూటమి పాలనా.. జవాబు చెప్పాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. అలాగే, తనకు సంఘీభావం తెలిపిన నేతలందరికీ అంబటి ధన్యవాదాలు తెలిపారు.
KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు శివారులోని కాకతీయ కాలువ వద్ద భారీ దొంగతనం జరిగింది. ఇక్కడ మోటార్లు ఏర్పాటు చేసుకొని సాగు చేసుకుంటున్న సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన రైతులపై దొంగలు కన్నేశారు. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 16 విద్యుత్ మోటార్లను అపహరించుకుపోయారు. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు మోటార్లు కనిపించకుండా పోయాయి అని వాపోయారు.
GDWL: శాంతినగర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు కోసం ఐనవోలు ఆలయ ఈవో సత్యనారాయణ రాజు పంపిన పెన్నులు పట్టణానికి చెందిన గాయత్రి శ్రీనివాసులు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రదానోపాధ్యాయులు మద్దిలేటి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.