• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: పెడన మండలం నేలకొండపల్లి నుండి లంకలాగంట వల్లే రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పూర్వ వైభవం తెచ్చేలా శ్రీకారం చుట్టారని తెలిపారు. రానున్న రోజుల్లో నూతన రోడ్లతో పాటు, రోడ్ల మరమ్మతు పనులు చేపడతామని స్పష్టం చేశారు.

March 4, 2026 / 04:56 PM IST

ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం

SDPT: అక్కనపేట మండలంలోనీ రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. శిక్షణలో భాగంగా ట్రైనర్లు సభ్యులకు పాలనా విధానాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సహా పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో పరిశుభ్రత, విద్య, వైద్యం వంటి వాటిపై తరగతులు నిర్వహించారు.

March 4, 2026 / 04:55 PM IST

నారాయణస్వామికి యథావిధిగా పూజలు ప్రారంభవ

చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో నిన్న చంద్రగ్రహణం సందర్భంగా దేవస్థాన అధికారులు ఆలయాన్ని మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం ఆలయాన్ని సంప్రోక్షణ చేసి పూజలు చేశారు. ఈరోజు నుంచి ఆలయంలో యథావిధిగా పూజలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో శ్రీగిరి రాజు నర్సింహబాబు తెలిపారు.

March 4, 2026 / 04:55 PM IST

న్యాయబద్దంగా కొన్న ఆస్తులకు నోటీసులా..?

PLD: కూటమి ప్రభుత్వం తన ఆస్థులపై దాడి చేసే ప్రయత్నం చేస్తుందని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దార్థనగర్‌లోని క్యాంప్ కార్యాలయం వద్ద బుధవారం అంబటి మాట్లాడారు. తనకు సత్తెనపల్లిలో ఉన్న 20 ఎకరాల పొలానికి సర్వే పేరుతో నోటీసులు ఇచ్చారన్నారు. కృష్ణానది గర్భంలో ఇళ్లు కట్టిన చంద్రబాబు తనను భయపెట్టాలని చూస్తున్నారని చెప్పారు.

March 4, 2026 / 04:54 PM IST

అసెంబ్లీని సందర్శించిన విద్యార్థులు

కృష్ణా: బాపులపాడు(M) వీరవల్లి వాణీ విద్యానికేతన్‌కు చెందిన విద్యార్థులు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు శాసనసభను సందర్శించారు. ఈ సందర్భంగా శాసనసభకు వచ్చిన విద్యార్థులను గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు ఆప్యాయంగా పలకరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ పాత్ర, ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధుల బాధ్యతల గురించి అవగాహన కల్పించారు.

March 4, 2026 / 04:50 PM IST

మామిడి సాగులో అప్రమత్తత అవసరం

KMM: కూసుమంచి మండలం మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని పాలేరు ఉద్యాన అధికారి పి.అపర్ణ తెలిపారు. మార్చి మాసంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. ప్రస్తుతం కాయలు బఠానీ గింజ పరిమాణంలో ఉన్నాయని, ఈ సమయంలో నల్లమచ్చ తెగులు సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

March 4, 2026 / 04:50 PM IST

‘యువత ఉపాధి పెంపుకు చర్యలు’

PDPL: యువతకు శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయన మంథనిలోని టాస్క్ సెంటర్‌ను సందర్శించారు. అవసరమైన పక్షంలో మరో భవనం నిర్మించాలన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా TGIIC ఆధ్వర్యంలో గార్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు 2 ఎకరాల స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

March 4, 2026 / 04:48 PM IST

60 రోజుల్లో పూర్తిగా రికవర్ అవుతా: రఘురామ

AP: క్రికెట్ ఆటలో గాయపడిన తాను కట్లు కట్టుకుంటాడని వైసీపీ ఆనందపడిందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ’60 రోజుల్లో పూర్తిగా రికవర్ అవుతా. ఈనెల 6న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటా. ఐపీఎస్ సునీల్ విషయంపై ఏదైనా మాట్లాడితే.. నన్ను ఓ వర్గానికి వ్యతిరేకం అని సృష్టిస్తారు. 10 రోజుల్లో కేసు పురోగతి తెలుస్తుంది’ అని పేర్కొన్నారు.

March 4, 2026 / 04:48 PM IST

రోడ్డు ప్రమాదంలో నాలుక కోల్పోయిన వ్యక్తి

NZB: చందూర్ మండలం వకీల్ ఫారం వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం వర్ని మండలం శంకొరా గ్రామానికి చెందిన గోపాల్ వకీల్ ఫారం వద్ద బైక్‌పై నుంచి పడ్డాడు. దీంతో అతని నాలుక తెగి తీవ్ర గాయాలు అయ్యాయి. చందూర్ 108 సిబ్బంది ఈఎంటీ రవి, పైలట్ వినోద్ ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

March 4, 2026 / 04:46 PM IST

జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్‌కు వినతి పత్రం

RR: మహేశ్వరం నియోజకవర్గం పహాడీ షరీఫ్ దర్గాలోని ఈద్గాలో పనుల కొరకు నిధులు మంజూరు చేయాలని, పహాడీ షరీఫ్ డివిజన్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ చంద్రకళకు పహాడి షరీఫ్ మాజీ కౌన్సిలర్ కొండల్ యాదవ్ వినతి పత్రం అందజేశారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 04:46 PM IST

ప్రియాంకతో కలిసి హోలీ జరుపుకున్న నిక్ జోనాస్

ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ జంట హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిక్ జోనాస్ సోషల్ మీడియాలో ప్రియాంకతో కలిసి ఉన్న అందమైన రొమాంటిక్ ఫొటోను షేర్ చేస్తూ అభిమానులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రతి ఏటా ఈ జంట హోలీ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంటోంది.

March 4, 2026 / 04:46 PM IST

బాల్య వివాహాలను చట్టనీత్యా నేరం ఎస్సై రమేష్

ELR: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని నిడమర్రు ఎస్సై రమేష్ అన్నారు. బుధవారం నిడమర్రు హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం భాగంగా ఐసీడీఎస్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సేఫ్టీ వంటి విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంకన అంగనవాడి సూపర్వైజర్ భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 04:46 PM IST

కొలికపూడి తీరుపై టీడీపీ నేత ఆగ్రహం

AP: ఎమ్మెల్యే కొలికపూడి తీరుపై టీడీపీ నేత బాల కోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియా ఎక్కడ ఏం దొరుకుతుందా అని చూస్తోందని అన్నారు. వాళ్లకి కొలికపూడి మాంసం ముద్దలు అందిస్తున్నారంటూ విమర్శించారు. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం, ఎంపీ చిన్నిపై దాడి చేస్తున్నారంటూ మండిపడ్డారు.

March 4, 2026 / 04:44 PM IST

‘విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలి’

NDL: పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఎంఈవో పీ. సుభాన్ అన్నారు. బుధవారం పగిడ్యాలలోని కస్తూర్బా బాలికల పాఠశాలను ఆయన తనిఖీ చేసి విద్యార్థులతో సమావేశమయ్యారు. పరీక్షలు రాసే విధానంపై అవగాహన కల్పిస్తూ ఈనెల 16న పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి మండలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

March 4, 2026 / 04:44 PM IST

సూర్యలంక బీచ్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: ఎమ్మెల్యే

BPT: సూర్యలంక బీచ్ అభివృద్ధి చెందడం లేదన్న ప్రచారాలు అసత్యమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు బుధవారం తెలిపారు. రూ. 97.52 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. కొత్త షాపులు, రెస్టారెంట్లు నిర్మిస్తున్నారు. ప్రతి వారం వేలాది మంది పర్యాటకులు వస్తున్నారని పేర్కొన్నారు. వసతి, భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు.

March 4, 2026 / 04:44 PM IST