కృష్ణా: బాపులపాడు(M) వీరవల్లి వాణీ విద్యానికేతన్‌కు చెందిన విద్యార్థులు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు శాసనసభను సందర్శించారు. ఈ సందర్భంగా శాసనసభకు వచ్చిన విద్యార్థులను గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు ఆప్యాయంగా పలకరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ పాత్ర, ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధుల బాధ్యతల గురించి అవగాహన కల్పించారు.