• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మార్చి 3 న చంద్రగ్రహణం.. ఆలయ ద్వారబంధనం

MBNR: చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారి ఆలయాలను మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. మంగళవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ద్వారబంధనం అమల్లో ఉంటుంది. గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులకు సాధారణ దర్శనం కల్పించనున్నారు.

March 1, 2026 / 11:13 AM IST

పెద్దపులి కాదు…. పెద్దపిల్లి పాదముద్రలు

MHBD: కురవి మండలంలోని కందికొండ గుట్ట శివారు అడవి ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందంటూ రెండు రోజులుగా ప్రచారం సాగుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ SHO ఆఫీసర్ రాణి, బీట్ ఆఫీసర్ ప్రత్యూష పాదముద్రలను పరిశీలించారు. అవి పెద్దపులి పాదముద్రలు కాదని, దాదాపు 12 సంవత్సరాలు దాటిన జంగపిల్లి పాదముద్రలు అని తేల్చారు. దీంతో రైతులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

March 1, 2026 / 11:13 AM IST

తడి పొడి చెత్తపై ప్రజలకు అవగాహన

CTR: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని శానిటరీ ఇన్‌స్పెక్టర్ ముని వెంకటప్ప పేర్కొన్నారు. ఆదివారం పుంగనూరు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తడి చెత్త-పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.

March 1, 2026 / 11:12 AM IST

బల్కంపేట్ అమ్మవారి ప్రత్యేక అలంకరణ

HYD: బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ తల్లిని ఆదివారం సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. సకినాలు, మురుకులు, గర్జలు, పలు రకాల పూలు, ఫలాలతో అత్యంత సుందరంగా గర్భగుడిని తీర్చిదిద్దారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి, దీప ధూప నైవేద్యాలు సమర్పించి, మంగళహారతులు ఇచ్చారు. భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి 30 నిమిషాల సమయం పడుతుంది.

March 1, 2026 / 11:12 AM IST

సభ్యత్వ నమోదు చేపట్టిన IFTU సంఘ నాయకులు

BDK: ఇల్లందు మండలం ముకుందాపురం గ్రామంలో IFTU భవన నిర్మాణ కార్మిక సంఘం ఆదివారం పర్యటించారు. ముందుగా భవన నిర్మాణ కార్మికులు ఐఎఫ్‌టీయూ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షులు సారంగపాణి మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు తప్పకుండా సభ్యత్వం తీసుకోవాలని తద్వార కార్మికుల హక్కులను సాధించుకోవడానికి సంఘం ఉపయోగపడుతుందని తెలిపారు.

March 1, 2026 / 11:12 AM IST

అమ్మవారిని దర్శించుకున్న MLA దంపతులు

KDP: జమ్మలమడుగు శ్రీ పెద్దమ్మ తల్లి దేవర సందర్భంగా ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. 17 ఏళ్ల తర్వాత జరుగుతున్న జాతర జమ్మలమడుగు ప్రజలకు ఒక పండగ వాతావరణంలా ఉందని, ఆ అమ్మవారి దీవెనలు ఎప్పుడు ప్రజలపై ఉండాలని ఆయన కోరారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రజలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు.

March 1, 2026 / 11:10 AM IST

ఐటీ కారిడార్‌లో ప్రతిష్ఠాత్మక 5K, 10K రన్

RR: ఐటీ కారిడార్‌లో ప్రతిష్ఠాత్మక JPMorgan Chase Run ఉత్సాహంగా ప్రారంభమైంది. సుమారు 1200 మంది 5K, 10K రన్‌లలో ఉత్సాహంగా పరుగులు తీస్తున్నారు. ఈ రన్ మార్గం సత్త్వ నాలెడ్జ్ సిటీ గేట్- 5 నుంచి ప్రారంభమై, ఆర్‌ఎంజెడ్ జంక్షన్, క్వాల్కమ్ డెడ్ ఎండ్, తంగేడు రెస్టారెంట్, డల్లాస్ సెంటర్ రోడ్, టీ-హబ్, సీ-గేట్, గేట్- 8 మార్గంగా తిరిగి గేట్- 5 వద్ద ముగుస్తుంది.

March 1, 2026 / 11:10 AM IST

మహిళా దినోత్సవ పై అవగాహన ర్యాలీ

W.G: జిల్లా వ్యాప్తంగా మార్చి 1 నుండి 8వ తేదీ వరకు మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఏలూరు నగరంలో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. పోలీస్ సంక్షేమ భవనం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ చేశారు. ర్యాలీని ఉద్దేశించి అదనపు ఎస్పీ సూర్య చంద్రరావు మాట్లాడుతూ.. సమాన హక్కులు సమాన గౌరవం, పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు.

March 1, 2026 / 11:10 AM IST

రాత్రి వేళలో మంగమారి పేటలో భూకబ్జాలు ?

విశాఖ: కాపులప్పాడ సర్వే నెంబర్ 314 ప్రభుత్వ భూమిలో రాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తులు ఫెన్సింగ్ పోల్స్ వేసి కబ్జాలకు పాల్పడుతున్నారని మంగమారిపేట స్థానికులు ఆరోపిస్తున్నారు. భీమిలి తహసీల్దార్ పి.రామారావుని వివరణ అడగగా ప్రభుత్వ భూమిలో కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించము. తక్షణమే ఫెన్సింగ్ పోల్స్ తొలగించి చర్యలు చేపడతామన్నారు.

March 1, 2026 / 11:07 AM IST

కిక్ బాక్సింగ్ పోటీలలో ద్రాక్షారామం బాలుడి ప్రతిభ

కోనసీమ: మండపేట మండలం ద్రాక్షారామంకి చెందిన కైరం విష్ణువర్ధన్ కిక్ బాక్సింగ్ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్, సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్, ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ వంటి పలు క్రీడలలో ఈ బాలుడు పాల్గొని స్వర్ణ, వెండి పథకాల సాధించాడు. ఇంటర్నేషనల్ పోటీలలో పాల్గొనడమే తన లక్యమన్నారు.

March 1, 2026 / 11:07 AM IST

శంషాబాద్ నుంచి విమాన సర్వీసులు రద్దు

RR: శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియాకు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాలకు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేయగా.. శంషాబాద్ నుంచి ఈ విమానాలను కూడా రద్దు చేసినట్లు డీజీసీఏ పేర్కొంది.

March 1, 2026 / 11:07 AM IST

నిశ్చితార్థం చేసుకున్న కంగనా రనౌత్..?

నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన చీరకట్టు ఫొటోలు SMలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఫొటోల్లో ఆమె వేలికి ఉన్న మెరిసే డైమండ్ రింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు నిశ్చితార్థం జరిగిందంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీనిపై కంగనా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

March 1, 2026 / 11:07 AM IST

దేవాలయ నిర్మాణానికి విరాళం అందజేత

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లిలోని శ్రీ శ్రీ శ్రీ సీత రామచంద్ర స్వామి వారి దేవస్థానం పునః నిర్మాణానికి పీర్జాదిగూడ కార్పోరేషన్ 5వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొడిగె స్వాతి కృష్ణ గౌడ్ రూ.1,00,101 లను విరాళంగా ఆదివారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ లోడే చంద్రయ్య గౌడ్, వైస్ ఛైర్మన్ మిరుపాటి జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.

March 1, 2026 / 11:06 AM IST

లాటరీ, ఫ్రీ గిఫ్ట్స్ అంటే నమ్మొద్దు: ఎస్సై

VKB: ఉచితం అంటూ గిఫ్టులు ఎరవేసి ఆశ చూపితే ఎవరూ నమ్మోద్దని పెద్దేముల్ SI ప్రశాంత్ వర్ధన్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. లాటరీ, ఫ్రీ గిఫ్ట్స్ అంటే ఆశ పడొద్దని తెలిపారు. ఎవరైనా ఉచితంగా ఇస్తున్నారంటే అది మోసమేనని ప్రజలు గుర్తించాలని చెప్పారు. ప్రజల అత్యాశే మోసగాళ్లకు పెట్టుబడిగా మారుతుందన్నారు. ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉంటూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.

March 1, 2026 / 11:05 AM IST

పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం జగ్గారం గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇవాళ  ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా బూరుగుగుంపు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్నారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించి కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరలోనే చేపడుతామని హామీ ఇచ్చారు.

March 1, 2026 / 11:04 AM IST