ADB: ఈరోజు నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు అనుమతులు లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ చనిపోయారని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పష్టత రావాల్సి ఉండగా.. ఖమేనీ X అకౌంట్ నుంచి ‘శాంతి కలుగుగాక’ అనే ఓ పర్షియన్ లైన్‌తో పోస్ట్ అయింది. దీంతో ఖమేనీ చనిపోయినట్లు పరోక్షంగా వెల్లడైందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఆయన క్షేమంగానే ఉన్నారని కొన్ని గంటల ముందు ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది.
SDPT: కొండపాక వద్ద కారు, డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో భార్యా భర్తలు ప్రాణాలు కోల్పోయారు. సింగరేణి ఉద్యోగి అబ్దుల్ రఫీ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఆయన భార్య మల్దూర్ బేగం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రోడ్డు మరమ్మతుల వల్ల వన్వే అమలులో ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో మంత్రి సవిత ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు, కలెక్టర్, అధికారులకు కందికుంట వెంకటప్రసాద్ దంపతులు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.
NLG: చిట్యాలలోని జాతీయ రహదారిపై గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో చీకటి అలుముకుంది. ఎస్‌బీహెచ్ యూటర్ను నుంచి రైల్వే స్టేషన్ యూటర్న్ వరకు లైట్లు పనిచేయడం లేదు. రహదారి పనుల కారణంగా కనెక్షన్లు తొలగించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. డివైడర్ మధ్యలో లైట్లు లేక సర్వీస్ రోడ్డు ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిజామాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లు నిర్వహణ పనుల కారణంగా పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 7వ తేదీ వరకు రద్దు చేశారు. కాచిగూడ – నిజామాబాద్ (77601), నిజామాబాద్ – కాచిగూడ (77602), నిజామాబాద్ – నాందేడ్ (77645), నాందేడ్ – నిజామాబాద్ (77646) రైళ్లు రద్దయ్యాయి.
WGL: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెల ద్వారా విద్యార్థుల సమస్యలు త్వరగా పరిష్కారమవుతున్నాయని జిల్లా డా. కలెక్టర్ సత్య శారద తెలిపారు. WGL కలెక్టర్ కార్యాలయంలో శనివారం రాత్రి ఫిర్యాదులు పెట్టెలో వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా చదివారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
E.G: రాజమండ్రిలో శనివారం జనసేనలోకి భారీగా చేరికలు జరిగాయి. 41వ వార్డుకు చెందిన మండవిల్లి నాగ వెంకట సత్యమురళీకృష్ణ (నానాజీ) తన అనుచరులు 50 మందితో కలిసి పార్టీలో చేరారు. సిటీ జనసేన ఇన్‌ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో వీరికి గంట స్వరూప దేవి, తదితరులు కండువాలు కప్పి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు వెల్లడించారు.
గార్లదిన్నె మండలం కృష్ణాపురంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అంగన్‌వాడీ కేంద్రానికి సరఫరా అవుతున్న కోడిగుడ్లను పరిశీలించారు. చిన్న పరిమాణంలో ఉన్న గుడ్లను గమనించి, నాణ్యమైనవి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులతో మాట్లాడారు.
SKLM: పట్టణంలో హెల్మెట్ ధరించడంపై ట్రాఫిక్ పోలీసుల సిఐ రామారావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, చిన్న దూరం ప్రయాణమైనా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ వినియోగించాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చాక్లెట్లు పంపిణీ చేశారు.
ASF: తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటికి చెందిన భోగే ఉపేందర్ ఎన్నికయ్యారు. వరంగల్‌లో జరిగిన రాష్ట్ర 4వ మహాసభలో ఈ ఎన్నిక జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం. నరసింహ ప్రకటనలో తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
KNR: స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో సర్టిఫికేట్ కోర్సు ఇన్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ కోర్సు 27వ బ్యాచ్ 6 నెలలపాటు జరిగింది. ఇందులో భాగంగా రెండు రోజులపాటు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. శనివారం జర్నలిజం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కోర్సు కో ఆర్డినేటర్, తెలుగు విభాగం అధ్యక్షులు, అసోసియేట్ ప్రొఫెసర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.
MNCL: కార్పొరేషన్ అభివృద్ధిలో కార్పొరేటర్లు, అధికారులు రాజీ పడవద్దని MLA ప్రేమ్ సాగర్ రావు సూచించారు. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం ఆవరణలో డివిజన్ల ఆఫీసర్లతో సమావేశం జరిగింది. ప్రతి ఇంటిని తమ ఇంటిగా భావించి సమస్యల పరిష్కారానికి ఆయా డివిజన్ల అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేశ్, అధికారులు పాల్గొన్నారు.
అనకాపల్లి: జిల్లాలో 91.37 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి తెలిపారు. మొత్తం 2,53,987 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,32,077 మందికి పంపిణీ చేశామన్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈనెల 2వ తేదీన వారికి పింఛన్లను పంపిణీ చేస్తామన్నారు.
ఖమేనీ చనిపోయారు: ట్రంప్ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ చనిపోయారని అమెరికార ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇరాన్ పౌరులతో పాటు, అమెరికన్లు, బాధిత దేశాలకు న్యాయం జరిగిందని తన ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. దాడులు మరో వారం కొనసాగుతాయని తెలిపారు. అటు ఇప్పటివరకు అందిన సూచనల ప్రకారం ఆ నిరంకుశుడు(ఖమేనీ) జీవించి ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు.