• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పర్యటన

NLR: గుడ్లూరు మండలంలో బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన కార్యక్రమం ఉన్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. రామాయపట్నం పోర్ట్ నిర్వాసితులైన కర్లపాలెం మత్స్యకారులకు R&R కాలనీలో నివేశన పట్టాలను మంత్రి పంపిణీ చేస్తారంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు కూటమి నేతలు పాల్గొంటారని పేర్కొంది.

March 3, 2026 / 01:37 PM IST

కాలేజీలో అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

TG: హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న యువతిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో అదే కాలేజీలో చదువుతున్న ఆశిష్ తనయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అతను తనని 2024లో కాలేజీలోని ఓ గదిలో అత్యాచారం చేశాడని.. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది.

March 3, 2026 / 01:36 PM IST

ఈనెల 5 నుంచి కిరండూల్ రైలు ర‌ద్దు

VSP: వాల్తేర్ డివిజన్‌లో శిలిమ్లిగూడ–కరకవలస మధ్య డబుల్ లైన్ పనుల కారణంగా నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు చేపడుతున్నారు. దీంతో విశాఖపట్నం–కిరండూల్ మధ్య నడిచే 58501, 58502 ప్యాసింజర్ రైళ్లు మార్చి 5 నుంచి 14/15 వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

March 3, 2026 / 01:36 PM IST

చింతపల్లిలో దుకాణాల తరలింపుపై ఎంపీడీవో హెచ్చరిక

ASR: ప్రధాన రహదారుల వెంట నిర్వహిస్తున్న చేపలు, మాంసం దుకాణాలను ప్రభుత్వం కేటాయించిన సంత మార్కెట్ ప్రాంగణానికి తప్పనిసరిగా తరలించాలని చింతపల్లి ఎంపీడీవో సీతామహాలక్ష్మి హెచ్చరించారు. కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, లాటరీ విధానంలో స్థలాలు కేటాయించినప్పటికీ కొందరు వ్యాపారులు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆమె తెలిపారు.

March 3, 2026 / 01:35 PM IST

కొడవటూరు శ్రీసిద్దేశ్వరాలయం మూసివేత..!

JN: కొడవటూరు శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయం గ్రహణం సందర్భంగా తాత్కాలికంగా మూసివేశారు. ఆలయ అధికారులు ఆగమ శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో దేవాలయ ద్వారాలను మూసివేసినట్లు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

March 3, 2026 / 01:35 PM IST

మంత్రి సీతక్కను కలిసిన సినీనటి మంచు లక్ష్మి

MLG: టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్, సినీనటి మంచు లక్ష్మి మంగళవారం మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 27 నిర్వహిస్తున్న కార్యక్రమానికి రావాలని ఆమె మంత్రిని ఆహ్వానించారు. తాను స్థాపించిన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను మంచు లక్ష్మి మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య కోసం తమ సంస్థ చేయూతనిస్తున్నదన్నారు.

March 3, 2026 / 01:35 PM IST

ఇసుక లారీ బీభత్సం వ్యక్తికి తీవ్ర గాయాలు

BDK: చర్ల మండలం గుంపెనగూడెంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించినట్లు స్థానికులు మంగళవారం తెలిపారు. చర్ల నుంచి భద్రాచలం వెళ్తున్న లారీ ఢీకొనడంతో చిట్టిబాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిత్యం ఇసుక లారీల రాకపోకలతో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 3, 2026 / 01:34 PM IST

మిట్ట కండ్రిగలో చెరుకు తోట దగ్ధం

CTR: శ్రీరంగరాజపురం మండలం ఎగువ కమ్మ కండ్రిగ పంచాయతీ మిట్టకండ్రిగ హరిజనవాడలో రైతు నవీన్‌కు చెందిన ఐదు ఎకరాల చెరుకు తోట అగ్నికి ఆహుతైంది. మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన తెల్లబెల్లం కూడా కాలిపోయింది. దీంతో దాదాపు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 01:34 PM IST

జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

NRPT: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన హోలీ పండుగ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంగులు చల్లుకునేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. మహిళలు పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ పండుగను హుందాగా జరుపుకోవాలని తెలిపారు.

March 3, 2026 / 01:34 PM IST

అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే విరాళం

ATP: పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామంలోని సుంకులమ్మ దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను మంగళవారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే నూతన దేవాలయ నిర్మాణానికి రూ.50,000 విరాళంగా అందజేశారు. గ్రామస్తులు ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించి సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

March 3, 2026 / 01:33 PM IST

బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు కార్మికులు కృషి చేయాలి: GM

BHPL: నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అందరూ కృషి చేయాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 2026లో 4.26 లక్షల టన్నుల లక్ష్యం ఉండగా 3.45 లక్షల టన్నులు ఉత్పత్తి అయిందని తెలిపారు. మార్చి నెలలో 4.54 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం ఉందని పేర్కొన్నారు.

March 3, 2026 / 01:33 PM IST

46వ డివిజన్‌లో వీధి లైట్ల సమస్య పరిష్కారం

ATP: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవతో 46వ డివిజన్ పరిధిలో వీధి లైట్ల సమస్య పరిష్కారమైంది. స్థానిక నాయకులు ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి అధికారులను ఆదేశించారు. దీంతో 3, 4, 5వ రోడ్లలో నూతనంగా వీధి లైట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

March 3, 2026 / 01:32 PM IST

మంత్రి సీతక్కను కలిసిన మంచు లక్ష్మి

HYD: ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను సినీనటి మంచు లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. ‘టీచ్ ఫర్ చేంజ్’ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా రంగంలో వస్తున్న మార్పులు, చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి లక్ష్మి మంత్రికి వివరించారు. ఈ క్రమంలోనే మార్చి 27న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని మంత్రిని ఆహ్వానించారు.

March 3, 2026 / 01:30 PM IST

వేంపల్లిలో పోస్టల్ సేవలపై అవగాహన

NZB: ముప్కాల్ మండలం వేంపల్లిలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో తపాల శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ సేవలపై అవగాహన కల్పించారు. జీవిత బీమా, పొదుపు, ఇన్సూరెన్సులు, తదితర సేవలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సరికెల సాగర్, గ్రామపంచాయతీ కారోబార్ సుంకరి కిషోర్ పాల్గొన్నారు.

March 3, 2026 / 01:30 PM IST

శ్రీ తుట్టే తమ్మ ఆలయంలో సౌకర్యాల లేమి..!

TPT: హనుమంతపురం గ్రామంలోని శ్రీ తుట్టే తమ్మ అమ్మవారి దేవాలయంలో మౌలిక సదుపాయాల లేమి తీవ్రంగా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూంలు, తాగునీటి సదుపాయం లేకపోవడంతో పాటు ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని తెలిపారు. హుండీ ఆదాయం, విరాళాల వినియోగంపై స్పష్టత లేదని ఆరోపిస్తూ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టి పారదర్శకంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను కోరారు.

March 3, 2026 / 01:30 PM IST