• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలి’

గుంటూరు నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు నగర కమిషనర్ కె. మయూర్ ప్రజారోగ్య అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. రోడ్లు, డ్రైన్లలో వ్యర్థాలు వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి వంద శాతం తడి, పొడి చెత్త సేకరించాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు కమిషనర్ సూచించారు.

March 1, 2026 / 09:10 AM IST

నేడు కందుకూరులో యూరియా బస్తాల పంపిణీ

RR: యాసంగి పంట సాగుకు యూరియా బస్తాల పంపిణీ ఇవాళ ఉంటుందని కందుకూరు వ్యవసాయ శాఖ తెలిపింది. కందుకూరులోని సొసైటీ ఆఫీస్ వద్ద ఉదయం10 గంటలకు రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేయనున్నారు. రైతులు యూరియా (ఫెర్టిలైజర్) ఆప్‌లో బుక్ చేసుకుని తర్వాత తమ పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకురావాలంటూ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 1, 2026 / 09:10 AM IST

స్టాక్ మార్కెట్.. రేపు పక్కా లాభాలు అంటూ కాల్స్..!

MDCL: ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం జరిగిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో రేపు పక్కాగా లాభాలు సాధించవచ్చని అనేకమంది నాచారం పరిధి రాఘవేంద్ర నగర్, మల్లాపూర్ వెంకటేశ్వర స్వామి నగర్ కాలనీ ట్రేడర్లకు ఫేక్ కాల్స్ వస్తున్నట్లుగా తెలిపారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, అలాంటి వాటిని నమ్మితే, మోసం జరిగే అవకాశం ఉందన్నారు.

March 1, 2026 / 09:09 AM IST

నేటి నుంచి పోలీసుల ప్రత్యేక డ్రైవ్

TG: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ లేకుడా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఇవాళ్టి నుంచి ప్రత్యేక తనిఖీలు చేయనున్నారు. ఈ క్రమంలో ఎవరైనా లైసెన్స్ లేకుండా పట్టబడితే ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి.. లైసెన్స్, ఎల్ఎల్ఆర్ తీసుకునేందు సమయం ఇస్తారు. అయితే లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

March 1, 2026 / 09:08 AM IST

గోదావరి జలాలు తగ్గింపు

SRPT: యాసంగి సీజన్‌కు గాను వారబందీ విధానంలో జిల్లాకు 1,700 క్యూసెక్కుల గోదావరి జలాలు విడుదల చేస్తుండగా శనివారం వాటిని 1,613 క్యూసెక్కులకు తగ్గించారు. ప్రస్తుతం వస్తున్న నీళ్లను వృథా చేయకుండా పంటలకు వాడుకోవాలని జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, ఏఈ చంద్రశేఖర్ రైతులకు సూచించారు.

March 1, 2026 / 09:06 AM IST

జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

మహబూబ్‌నగర్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 257 నుంచి రూ.260 మధ్య ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ. 292 నుంచి రూ. 300 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 20 వరకు పెరిగింది

March 1, 2026 / 09:05 AM IST

శ్రీశైలంలో నేడే కామదహనం

NDL: శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు కామదహనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాన ఆలయం ముందు గంగాధర మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం సంప్రదాయం ప్రకారం మన్మథ రూపాన్ని దహనం చేస్తారని వివరించారు.

March 1, 2026 / 09:05 AM IST

ఖమ్మంలో నేటి కూరగాయల ధరలు ఇలా

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ రైతు మార్కెట్‌లో ఆదివారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ.16, వంకాయ రూ.20, బెండకాయ రూ.26, పచ్చిమిర్చి రూ.46, కాకర రూ.36, బీరకాయ రూ.26, సొరకాయ రూ.16, దొండకాయ రూ.30, క్యాబేజీ రూ.20, ఆలుగడ్డ రూ.20, చామగడ్డ రూ.30, క్యారెట్ 30, కీరదోస 30, బీన్స్ 50, క్యాప్సికం రూ.56, ఉల్లిగడ్డలు 25, కోడిగుడ్లు(12) 75 గా ఉన్నాయి.

March 1, 2026 / 09:05 AM IST

ఎంజీయూ ఇంటిగ్రేట్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పరీక్ష షెడ్యూల్

నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఐదేళ్ల ఇంటిగ్రేట్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పరీక్షల సమయం పట్టికను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. 8వ సెమిస్టర్ (రెగ్యులర్ బ్యాక్ లాగ్) పరీక్షలు మార్చి 11 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలియజేశారు.

March 1, 2026 / 09:05 AM IST

సీతారాముల కళ్యాణోత్సవ పవిత్ర తలంబ్రాల పోస్టర్ల ఆవిష్కరణ

NZB: భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవ పవిత్ర తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శనివారం బోధన్ డిపోలో దీనికి సంబంధించిన పోస్టర్లను డీఎం విశ్వనాథ్ ఆవిష్కరించారు. కేవలం రూ.151 చెల్లించి కార్గో సేవల ద్వారా నమోదు చేసుకుంటే నేరుగా భక్తుల ఇళ్లకు తలంబ్రాలు డెలివరీ చేస్తామని ఆయన తెలిపారు.

March 1, 2026 / 09:04 AM IST

ఈనెల 7 నుంచి సిద్ధిరామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

KMR: భిక్కనూర్‌లోని సిద్ధరామేశ్వర స్వామి ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 7 నుంచి 11 వరకు జరగనున్నాయి. భువనేశ్వరీ సహిత స్వామి వారికి పుణ్యహవాచనం, అంకురార్పణం, రుద్రాభిషేకం, కల్యాణోత్సవం, విమాన రథోత్సవం, అవభృథ స్నానం నిర్వహించనున్నారు. అగ్నిగుండాలు, వీరభద్ర ప్రస్తావన, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

March 1, 2026 / 09:04 AM IST

బగ్గీల ప్రతిభకు వేదికైన బాజా SAE ఇండియా 2026

MDK: B V Raju Institute of Technology, నర్సాపూర్‌లో “మెకానికల్ బాజా SAE ఇండియా 2026” మూడో రోజు స్టాటిక్, డైనమిక్ ఈవెంట్స్ ఉత్సాహంగా సాగాయి. 42 వాహనాలు టెక్నికల్ ఇన్స్పెక్షన్ పూర్తి చేయగా, 35 బగ్గీలు బ్రేక్ టెస్ట్ ఉత్తీర్ణులై ఫైనల్ ఎండ్యూరెన్స్‌కు అర్హత సాధించాయి. అనుభవాధారిత విద్యపై ప్యానల్ చర్చ జరిగింది. ఆదివారం నుంచి ఫైనల్ రేస్ జరగనుంది.

March 1, 2026 / 09:03 AM IST

నేడు జిల్లాలో మాంసం ధరలు ఎంతంటే..?

నెల్లూరు జిల్లాలో ఈ ఆదివారం చికెన్, మటన్ ధరలు ముందు వారంతో పోలిస్తే కాస్త పెరిగాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేజీ స్కిన్తో కూడిన చికెన్ రూ. 270, స్కిన్లెస్ చికెన్ రూ. 300, నాటుకోడి మాంసం కేజీ రూ. 700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000కు అమ్ముతున్నారు. ప్రాంతాలవారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వారు పేర్కొన్నారు.

March 1, 2026 / 09:02 AM IST

అంబటి రాంబాబుకు కల్యాణదుర్గం పోలీసుల నోటీసులు

ATP: CM చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కల్యాణదుర్గం పోలీసులు నోటీసులు ఇచ్చారు. కల్యాణదుర్గంలో నమోదైన ఈ కేసు విషయమై గుంటూరు సిద్ధార్థనగర్‌లోని అంబటి కార్యాలయానికి కానిస్టేబుల్ వచ్చి నోటీసులు అందజేశారు. విచారణకు సహకరించాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

March 1, 2026 / 09:00 AM IST

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

సత్యసాయి: జిల్లాలో ఉపాధి హామీ పని దినాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నుంచి ప్రతిరోజూ లక్ష పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఏడాది 19,508 కుటుంబాలు వంద రోజుల పని పూర్తి చేసుకోగా, ఈసారి ఆ సంఖ్యను పెంచాలని అన్నారు.

March 1, 2026 / 09:00 AM IST