చాలామంది మహిళలు ఇంటి పనులు, ఆఫీస్ వర్క్ వల్లే నీరసపడుతున్నామని అనుకుంటారు. కానీ, దీనికి ప్రధాన కారణం శరీరంలో ఐరన్ లోపం కావచ్చు. ఇది దీర్ఘకాలంలో రక్తహీనతకు దారితీస్తుంది. కాబట్టి కేవలం కడుపు నిండా తినడమే కాదు, ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్యం. నిరంతరం అలసటగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవాలి.
అన్నమయ్య: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం తెలంగాణతో చీకటి ఒప్పందం చేసుకొని ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. జగన్ ప్రభుత్వంలో మొదలైన ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. కడపలో రేపు జరగబోవు ఉద్యమంలో అందరూ పాల్గొనాలని కోరారు.
HNK: ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో బీసీ కాలనీలో ప్రాథమిక పాఠశాల కంపౌండ్ వాల్ నిర్మాణానికి, ఎస్సీ కాలనీలో మహిళా సంఘం భవన నిర్మాణ పనులకు ఎంపీ కడియం కావ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.
BDK: భద్రాచలం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు ఆదివారం పర్యటించనున్నారు. చర్లలో ఆసుపత్రి శంకుస్థాపనతో పాటు, పలు మండలాల్లో సర్పంచుల సన్మానం కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం భద్రాచలంలో నవమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక అభివృద్ధి పనులపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటానని ఛైర్మన్ సారంగపాణి అన్నారు. వర్ధన్నపేట 2, 7వ వార్డులో ఛైర్మన్ పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వార్డును అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఛైర్మన్ తెలిపారు.
PPM: మార్చి 14 నుంచి 29 వరకు వివిధ జిల్లాలో క్రీడా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి డా కె. శ్రీధర్ రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అథ్లెటిక్స్ (మాస్టర్స్) 100, 200, 800, 1500, లాంగ్ జంప్, షాట్ ఫుట్, డిస్కస్, హై జంప్, జావెలిన్ గుంటూరు డీఎస్ఏ మైదానంలో జరుగుతాయి.
MNCL: మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మందమర్రి మండల పంచాయతీ అధికారి ములకల సత్యనారాయణ మృతి చెందారు. బైక్‌పై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన లారీ ఆయన్ని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పేలుడు వివరాలను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. దీంతో వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని హోంమంత్రిని ఆయన ఆదేశించారు. కాగా, బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఆరుగురు చనిపోయినట్లు సమాచారం.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శనివారం, ట్రస్మా ప్రైవేట్ విద్యాసంస్థల తరపున మున్సిపల్ ఛైర్మన్ మైలారం లింబాద్రి, వైస్ ఛైర్మన్ ఓంకారి నవీన్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా ప్రైవేట్ విద్యాసంస్థల పట్టణ అధ్యక్షులు ప్రదీప్ గౌడ్, సెక్రెటరీ శేఖర్, ట్రెజర్ రాజకుమార్, రామారావు, దొంతల రాజ్ కుమార్, మహర్షి, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చైర్పర్సన్ భవాని అధ్యక్షత వహించారు. ఎజెండాలో రూపొందించిన అంశాలను చదివి వినిపించారు. రానున్న వేసవి కాలంలో పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని చైర్ పర్సన్ కు మున్సిపల్ కమిషనర్ కు కోరారు.
VSP: మెడికల్ మాఫియా దోపిడీని వెంటనే అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ డిమాండ్ చేశారు. శనివారం బుల్లయ్య కాలేజీ ఎదురుగా డీఎంహెచ్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి, ప్రైవేట్ దవాఖానల్లో అవసరం లేని పరీక్షలు, భారీ ఫీజులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’లో గత కొద్దిసేపటి నుంచి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా వేలమంది యూజర్లు తమ అకౌంట్స్‌లోకి లాగిన్ అవ్వలేకపోతున్నామని ఫిర్యాదు చేస్తున్నారు. సర్వర్ డౌన్ కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీనిపై యాజమాన్యం స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.
KDP: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని SI ఘన మద్దిలేటి పేర్కొన్నారు. శనివారం తొండూరు(మం) ఇనగలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా కష్టపడాలన్నాడు. యూవ్ టీజింగ్ వేధింపులకు గురైతే తమకు తెలపాలన్నారు.
మహబూబ్ నగర్: రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ స్టేటస్‌ను ఆన్లైన్ ద్వారా తమ నమోదును సులభంగా తెలుసుకోవచ్చని హన్వాడ మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఆన్లైన్లో రైతులు ఈ లింక్ https://tlfr.agristack.gov.in/farmer-registry-tl/#/checkEnrolmentStatus ను ఓపెన్ చేసి ఆధార్ నెంబర్‌ను నమోదు చేస్తే రైతు పేరు, రైతు ఐడి నెంబర్, అప్రూవ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చని అన్నారు.
TG: కోకాపేట శారదాపీఠం భూమిపై రెవెన్యూ అధికారులు వివరణ ఇచ్చారు. శారదాపీఠం భూమిని ప్రభుత్వం వాటర్‌వర్క్స్‌కు ఇవ్వాలనుకుందని వెల్లడించారు. శారదాపీఠానికి ప్రభుత్వమే గతంలో భూమి కేటాయించిందని తెలిపారు. ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. కోకాపేట భూమికి బదులు శంషాబాద్‌లో భూమి కేటాయిస్తామని స్పష్టం చేశారు.