సత్యసాయి: ధర్మవరంలోని రామ్‌నగర్‌లో హెచ్‌పీవీ (HPV) టీకాల కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం బీజేపీ నేత హరీశ్ బాబు పాల్గొని టీకాల ప్రక్రియను పరిశీలించారు. బాలికల భవిష్యత్ ఆరోగ్య భద్రతకు హెచ్‌పీవీ టీకాలు కీలకమని ఆయన తెలిపారు. 14–15 ఏళ్ల బాలికలకు ఈ టీకాలు వేయడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.
MDCL: KPHB రైతు బజార్ ప్రాంతంలో జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలుసుకుని జనసేన సిద్ధాంతాలు వివరించి సభ్యత్వ నమోదు చేపడుతున్నారు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు నేతలు తెలిపారు.
NTR: ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో సోమవారం ఇంటింటికి తిరుగుతూ ప్రజల వద్ద నుండి ఇంటి పన్నులను వసూలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పన్నులు ఆలస్యంగా చెల్లిస్తే జరిమానాలు విధించే అవకాశం ఉందన్నారు.
PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన అర్జీలపై సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, చట్టపరంగా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
VZM: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం జిల్లాలో హెచ్‌పీవీ టీకాల కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా ఇవ్వనున్నట్లు, ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ మూడు నెలలు కొనసాగుతుందని తెలిపారు.
SKLM: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తన కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గం నుంచి ప్రజలు వారి గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైన్లు, సాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు రూపంలో వినతులు అందజేశారు. వినతులను పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
హన్మకొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐలో సోమవారం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే నూతన ఆరు కోర్సులను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ శిక్షణా శిబిరాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
NTR: విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల ప్రజా వేదిక కార్యక్రమాల్లో హౌసింగ్ ఔట్‌సోర్సింగ్ ఎస్సీ, ఎస్టీ యూనియన్ నాయకులు పాల్గొని జాయింట్ కలెక్టర్ ఇలాక్కియకి వినతి పత్రాన్ని అందజేశారు. హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను విడుదల చేయాలని కోరారు.
NTR: మైలవరం సర్కిల్ సీఐగా కిషోర్ బాబు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు కృషి చేస్తామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోగుతామన్నారు. అనంతరం స్టేషన్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
TPT: కౌమార దశలో గర్భధారణ వల్ల తల్లి, శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో కౌమార గర్భధారణ నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కిశోర బాలికలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
TG: కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులకు ధన్యవాదాలు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సమస్యలను రాజ్యసభలో, ఢిల్లీలో వినిపిస్తానని పేర్కొన్నారు. వాటిని పరిష్కరించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు.
WGL: పట్టణ కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే KR నాగరాజును, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. MLA మాట్లాడుతూ.. మహిళల సాధికారత, సామాజిక న్యాయం కోసం ఆమె నాయకత్వంలో మరింత బలోపేతం కలగాలని ఆకాంక్షించారు.
ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ సంఘం నాయకులు, గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ త్రివేణికి వినతిపత్రం సమర్పించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఆయన ఆశయాలు మరింతగా చేరువ అవుతాయని పేర్కొన్నారు.
కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ బాలాజీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్, అధికారులు పాల్గొన్నారు.
ATP: గుత్తి కోట ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గుత్తి కోట ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 14,15 తేదీలలో రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.