• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గంగమ్మతల్లి మహోత్సవాలకు మంత్రికి ఆహ్వానం

PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన గంగపుత్రులు ఆదివారం ధర్మపురి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసి శ్రీ గంగమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలకు ఆహ్వాన పత్రిక అందజేశారు. మార్చి 12, 14 తేదీల్లో జరిగే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరారు. గ్రామంలో వేడుకల కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

March 1, 2026 / 03:42 PM IST

ఈనెల 3న బోయకొండ ఆలయం మూసివేత

CTR: ఈనెల 3న చంద్రగ్రహణం కారణంగా బోయకొండ గంగమ్మ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో ఏకాంబరం ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. పండితుల సూచనల మేరకు ఆరోజు ఉదయం 9 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుందన్నారు. అనంతరం ఆలయం మూసివేస్తున్నట్టు వెల్లడించారు. 4వ తేదీన ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి అభిషేకం అనంతరం దర్శనాలు ప్రారంభిస్తామన్నారు.

March 1, 2026 / 03:41 PM IST

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్

SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి, సర్పంచులు కటకం మల్లేశం, పాల్గొన్నారు.

March 1, 2026 / 03:40 PM IST

రేపు నూజివీడులో ‘మీకోసం’

ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘మీ కోసం-ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని కోరారు. వీటిని ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

March 1, 2026 / 03:40 PM IST

బీమా ఏజెంట్ల అసోసియేషన్ డివిజన్ ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్

MNCL: జీవిత బీమా ఏజెంట్ల అసోసియేషన్ కరీంనగర్ డివిజన్ ఉపాధ్యక్షుడిగా మంచిర్యాలకు చెందిన సీనియర్ ఏజెంట్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించినట్లు డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు ఆదివారం ప్రకటనలో తెలిపారు. తన నియామకానికి సహకరించిన వారికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

March 1, 2026 / 03:40 PM IST

HMT కాలనీలో మొక్కల పంపిణీ కార్యక్రమం

MDCL: అల్వాల్ సర్కిల్ HMT ఆఫీసర్స్ కాలనీలోని బతుకమ్మ పార్క్‌లో ఆదివారం కాలనీ వాసులు వినూత్నంగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు కుండితో సహా ఒక మొక్కను కాలనీ కమిటీకి అందజేశారు. మాజీ అధ్యక్షుడు బలరాం గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రావు, ఉపాధ్యక్షుడు వికాస్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని జరుపుకున్నారు.

March 1, 2026 / 03:40 PM IST

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం: పొంగులేటి

TG: భద్రాద్రి జిల్లా చర్లలో నూతన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు ప్రజా తీర్పు వన్‌సైడ్ వచ్చింది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మావైపే ఉన్నారు. పాలెంవాగు పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. వచ్చే నెల రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం’ అని తెలిపారు.

March 1, 2026 / 03:40 PM IST

వెంకన్న సేవలో ఎమ్మెల్యే ధర్మరాజు

ELR: గణపవరం వెలంపేటలో వేంచేసి యున్న శ్రీ గోధా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు సాదర స్వాగతం పలికి సన్మానించారు.

March 1, 2026 / 03:37 PM IST

చంద్రగ్రహణం.. యాదాద్రి ఆలయ దర్శనీయ వేళల్లో మార్పులు

BHNG: లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా దర్శనీయ వేళలు ఇలా ఉన్నాయి. ఉ. 3 గంటలకు సుప్రభాతం, 3:30లకు తిరు ఆరాధన, బాల భోగం, ఆరగింపు, 4:30 నిజాభిషేకం, 5:15 సహస్రనామార్చన, 5:45 ఉభయ దర్శనాలు, 7:00 ఆలయం మూసివేత. 4వ తేదీన ఉదయం 3:00 ఆలయ సంప్రోక్షణ, 5:30 సుప్రభాతం, 6:00 ఆరగింపు, 7:30 నిజాభిషేకం, 8:15 అర్చన, 8:45 దర్శనాలు.

March 1, 2026 / 03:35 PM IST

‘రణబాలి’ ఫస్ట్ లుక్.. దర్శకుడి ఎమోషనల్ పోస్ట్

‘రణబాలి’ చిత్రంలోని విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. 1800ల నాటి సహజత్వం, మట్టి వాసన ఉట్టిపడేలా దీన్ని రూపొందించామని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెలిపాడు. ఈ సీన్ వారి నిజ జీవిత వివాహంతో యాదృచ్ఛికంగా సరిపోలిందని, ఇది చూస్తుంటే వారి గత జన్మ పెళ్లి ఫొటోలా అనిపిస్తోందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

March 1, 2026 / 03:35 PM IST

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పనులు ప్రారంభం

PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సీసీ రోడ్డు పనులు ప్రారంభం కావడంతో 10 రోజుల పాటు బస్సుల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు డిపో మేనేజర్ లక్ష్మణరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎల్విన్‌పేట జంక్షన్ నుంచి బస్సులు యథావిధిగా నడుస్తాయని, ప్రయాణికులు సహకరించాలని కోరారు.

March 1, 2026 / 03:34 PM IST

వైభవంగా శబరిమాత ఉత్సవాలు

ADB: బోథ్ మండలం కన్గుట్టలో శబరిమాత 2వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన షెడ్డుకు ఆయన భూమిపూజ చేశారు. ఆధ్యాత్మికతతోనే సమాజంలో సేవాభావం పెంపొందుతుందని పేర్కొన్నారు.

March 1, 2026 / 03:34 PM IST

‘తెప్పోత్సవానికి సర్వం సిద్ధం’

JGL: ధర్మపురిలో మార్చి 3-5 వరకు తెప్పోత్సవం, డోలోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో బ్రహ్మ పుష్కరిణిని ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది పూర్తిగా శుభ్రం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోనేరులో నీటిని మార్చి, పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. భద్రతా పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

March 1, 2026 / 03:34 PM IST

‘దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

SRPT: బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నడిగూడెం ఎస్సై అజయ్ కుమార్ కోరారు. ప్రయాణాల్లో, ముఖ్యంగా రాత్రి వేళల్లో భారీ బంగారు ఆభరణాలు ధరించవద్దని, పిల్లలకు నగలు వేసి ఒంటరిగా బయటకు పంపవద్దని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 లేదా 112కి కాల్ చేయాలన్నారు.

March 1, 2026 / 03:33 PM IST

సంగంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

NLR: సంగంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయ ప్రాంగణంలో రైతుల కోసం లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీ సీజన్‌లో ధాన్యం సేకరణ కేంద్రాన్ని మంత్రి ఆనం ప్రారంభించారు. అనంతరం సభా వేదిక వద్ద రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. సంగంలో రైతుల నుంచి ధాన్యం సేకరణకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రైతులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

March 1, 2026 / 03:32 PM IST