• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆలూరుకోన భక్తులకు గమనిక

ATP: తాడిపత్రి మండలంలోని ప్రసిద్ధ ఆలూరుకోన రంగనాథస్వామి క్షేత్రానికి వెళ్లే భక్తులకు అధికారులు కీలక సూచన చేశారు. ఆలూరు గ్రామం నుంచి దేవస్థానం వరకు నూతనంగా తారు రోడ్డు పనులు చేపట్టినందున ఆదివారం వరకు వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. భక్తులు ఆలూరు మీదుగా కాకుండా సజ్జలదిన్నె, ఓబులేసుకోన మార్గాల ద్వారా క్షేత్రానికి చేరుకోవాలని కోరారు.

February 26, 2026 / 10:08 AM IST

ఆలయానికి 9 కిలోల కంచు గంట

RR: కొందుర్గులోని లక్ష్మీదేవునిపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామలింగేశ్వర ఆలయానికి సీనియర్ న్యాయవాది చెంది మహేందర్ రెడ్డి 9 కిలోల కంచు గంటను అందజేశారు. గ్రామస్థుల సహకారంతో నిర్మించిన ఈ ఆలయానికి తన వంతుగా గంట, హారతి పళ్లెం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనను అభినందించారు. భక్తి భావంతో దాతలు ముందుకు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 26, 2026 / 10:07 AM IST

వికారాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా ఉన్న దీపక్ తివారి కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతీక్ జైన్ ఇక్కడి నుంచి నారాయణపేటకు బదిలీ అయ్యారు.​ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ప్రతీక్ జైన్, ముఖ్యంగా పాఠశాలల్లో వసతులపై ప్రత్యేక దృష్టి సారించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

February 26, 2026 / 10:06 AM IST

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద 25 కంపార్ట్‌మెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 73,035 మంది శ్రీవారిని దర్శించుకోగా, 27,090 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.48 కోట్లుగా నమోదైంది.

February 26, 2026 / 10:06 AM IST

బొల్లారం స్టేషన్ టెర్మినల్ చేయాలని డిమాండ్..!

HYD: సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. మరోవైపు రైళ్లను నిలిపేందుకు తగిన స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇటీవల ఎంపీ ఈటెల రాజేందర్ సైతం అన్నారు. నార్త్ హైదరాబాద్ గుండెకాయ లాంటి బొల్లారం స్టేషన్ ప్రాంతాన్ని సైతం ఒక టెర్మినల్ చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది.

February 26, 2026 / 10:06 AM IST

ఎదులపాడు గ్రామంలో పోలీసుల ‘కార్డన్ సెర్చ్’

ASF: తిర్యాణి మండలం ఎదులపాడు గ్రామంలో గురువారం రెబ్బెన CI సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించారు. CI మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.

February 26, 2026 / 10:05 AM IST

జిల్లా సైక్లింగ్ సంఘం వైస్ ప్రెసిడెంట్‌‌గా గంగారెడ్డి

NZB: ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన సైక్లింగ్ సంఘం ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్‌గా నలవేలి గ్రామానికి చెందిన కుంట గంగారెడ్డి, మైలారం కు చెందిన జితేందర్ జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా నియమితులైనట్లు ప్రధాన కార్యదర్శి భూలోక విజయ్ కాంత్ రావు తెలిపారు. క్రీడల పైన అనుభవం ఉన్నందువలన వీరికి అవకాశం కల్పించామని తెలిపారు. వీరిని పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

February 26, 2026 / 10:03 AM IST

పాలిటెక్నీక్ కళాశాలలో కొత్త కోర్స్

MNCL: బెల్లంపల్లి పాలిటెక్నీక్ కళాశాలలో కొత్తగా ఆటోమేషన్ & రోబోటిక్స్ కోర్సు అందుబాటులోకి రావడం శుభ పరిణామమని ప్రిన్సిపాల్ దేవేందర్ ప్రకటనలో తెలిపారు. పాత కోర్సులను మేళవించి ఆధునీకరించడంతో పాటు పరిశ్రమల భావి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిపుణులు ఈ కోర్సుకు రూపకల్పన చేశారన్నారు. కొత్త కోర్సులో అడ్మిషన్ పొందే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు.

February 26, 2026 / 10:03 AM IST

నేటి పత్తి ధర వివరాలు ఇలా..!

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో గురువారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ. 8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ. 7,060గా నిర్ణయించారు. బుధవారం ధరతో పోలిస్తే గురువారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధర రూ. 40 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.

February 26, 2026 / 10:03 AM IST

విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన

 NTR: ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్తు సరఫరానే ప్రభుత్వ లక్ష్యమని MLA వసంత కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం(M) కిలేశపురంలో రూ.4.2 కోట్ల హడ్కో నిధులతో 33/11 కెవి విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఉపకేంద్రం వల్ల లో వోల్టేజ్, బ్రేక్‌డౌన్ సమస్యలు తగ్గి గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన విద్యుత్తు అందుతుందని తెలిపారు.

February 26, 2026 / 10:02 AM IST

మండపేట రానున్న కాశీ పీఠాధిపతులు శివ నాగేంద్ర సరస్వతి

ASR: వారణాసికి చెందిన ప్రముఖ కాశీ పీఠాధిపతులు శ్రీ శివ నాగేంద్ర సరస్వతి స్వామీజీ మార్చి 1 న మండపేట విచ్చేస్తున్నట్లు మండపేట 15 వ వార్డు కౌన్సిలర్ గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. మార్చి1 నుంచి 5 వరకు మండపేట ధర్మ గుండం చెరువు వద్ద గల శ్రీ రాజరాజేశ్వరి పీఠం వద్ద ఉంటారని చెప్పారు. 5 రోజులు పాటు స్వామి వారు మండపేటలోనే ఉంటూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.

February 26, 2026 / 10:01 AM IST

శ్రీరంగనాథ ఆలయంలో ధ్వజారోహణం కార్యక్రమం

WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో గురువారం ధ్వజారోహణం జరుగుతుందని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా గరుడ ప్రసాద వితరణ నిర్వహిస్తారు. సంతానం లేని దంపతులు ప్రసాదం స్వీకరిస్తే ఫలితం ఉంటుందని వేద పండితులు పేర్కొన్నారు. భక్తులు ఉదయం 10 గంటలకు ఆలయానికి రావాలని వారు కోరారు.

February 26, 2026 / 10:01 AM IST

దేవరకొండలో ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని 4 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షకు హాజరయ్యారు. అధికారులు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించారు.

February 26, 2026 / 10:01 AM IST

గోదావరి జలాల పెంపు..

SRPT: యాసంగి సీజన్‌కు వారబందీ విధానంలో ఇస్తున్న గోదావరి జలాలను బుధవారం సాయంత్రం పెంచారు. 1,750 క్యూసెక్కులు వదులుతుండగా 1,810 క్యూసెక్కులకు పెంచారు. రెతులు నీటిని వృథా చేయవద్దని జలవనరులశాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయన్న వాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. చివరి భూములకు నీళ్లు చేరేందుకు ఈసారి అవకాశం ఉన్న మేర ఎక్కువ నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు.

February 26, 2026 / 10:01 AM IST

పంచాయతీ కార్యదర్శుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

CTR: జీడీనెల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో మండల పంచాయతీ కార్యదర్శుల సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల అధికారిగా ఎంపీడీవో మనోహర్ గౌడ్ వ్యవహరించారు. అధ్యక్షుడిగా గంగాధరనెల్లూరుకు చెందిన వి.శివయ్య, మండల ప్రధాన కార్యదర్శిగా ముక్కళత్తూరుకు చెందిన పి. కిరణకుమార్ ఎంపికయ్యారు.

February 26, 2026 / 10:01 AM IST