• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పవర్‌లిఫ్టింగ్‌లో మెరిసిన యువతి.. MLA అభినందన..!

HYD: హరిద్వార్‌లో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన ఓల్డ్ బోయినపల్లికి చెందిన ఎం.తనయను MLA వివేకానంద అభినందించారు. తనయ ఇటీవల జిల్లా స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం, CM పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం MLA క్యాంపు కార్యాలయంలో ఆమెను MLA సన్మానించారు.

February 26, 2026 / 06:40 PM IST

నియోజకవర్గ సమస్యలపై సీఎంతో మాట్లాడిన ఎమ్మెల్యే

PLD: అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సీఎం చంద్రబాబుతో ముచ్చటించారు. నియోజకవర్గ సమస్యలపై సీఎం చంద్రబాబుకు వివరించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న వంద రోజులు 100 గ్రామాలు కార్యక్రమం గురించి తెలిపారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన మేర పరిష్కరిస్తున్నామన్నారు. నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని భాష్యం కోరారు.

February 26, 2026 / 06:40 PM IST

టైలర్స్ డేను జయప్రదం చేయండి: బాజీ ఉల్లా

SRPT: కుట్టు మిషన్ ఆవిష్కరించి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన విలియమ్స్ హో జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 28న నిర్వహించే టైలర్స్ డేను విజయవంతం చేయాలని జిల్లా టైలర్స్ యూనియన్ నాయకులు బాజీ ఉల్లా తెలిపారు. గురువారం స్థానిక గాంధీ పార్క్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టైలర్ వృత్తి గౌరవాన్ని కాపాడుతూ, సంఘటితంగా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

February 26, 2026 / 06:40 PM IST

ఐటీఐ కళాశాలను సందర్శించిన కలెక్టర్

CTR: త్వరలో ఐటీఐ కళాశాలకు కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం విజయ పురంమండలంలో ప్రధాన కేంద్రంలో ఉన్న ఐటీఐ కళాశాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఐటీఐలో ఎలక్ట్రికల్, పిట్టర్, ఆటోమొబైల్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్ వివిధ సెక్షన్‌లను పరిశీలించారు.

February 26, 2026 / 06:40 PM IST

జర్నలిస్టులకు హైకోర్టులో ఊరట

TG: రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, అక్రిడిటేషన్ కార్డుల నిబంధనల మార్పులపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని ఆదేశించింది. అలాగే, GO 252, సవరించిన GO 103పై ప్రభుత్వం పూర్తిస్థాయి వివరణ సమర్పించాలని ఆదేశించింది.

February 26, 2026 / 06:38 PM IST

IND vs ZIM: ప్లేయింగ్-11

జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్.. రింకూ సింగ్ స్థానంలో సంజూ శాంసన్ ఆడుతున్నారు.ZIM: మారుమణి(w), బెన్నెట్, మైయర్స్, ర్యాన్, సికందర్(సి), టోనీ, తషింగా, బ్రాడ్, మపోసా, ముజారబానీ, నగరవIND: సంజు(w), అభిషేక్, ఇషాన్, సూర్య(c), తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్‌దీప్, చక్రవర్తి, బుమ్రా

February 26, 2026 / 06:37 PM IST

వెలుగుమట్ల ప్రజలకు న్యాయం చేయండి: సీపీఐ ఎంఎల్

KMM: పట్టణంలో వెలుగుమట్ల ప్రాంతంలో పది సంవత్సరాల క్రితం పేద ప్రజలు భూధన భూమిలో ఇళ్లు నిర్మాణం చేసుకొని ఇక్కడ జీవిస్తున్నారు. ఈనెల 24 తేదీన యంత్రాలతో అధికారులు కూల్చేశారు. గురువారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అనుదీప్‌కు వినతి పత్రం అందజేసి ఇళ్లు కూల్చివేత తిరిగి ప్రత్యామ్నాయమై ఏర్పాటు చేయాలని కోరారు.

February 26, 2026 / 06:36 PM IST

నీట్ పరీక్షకు ఆరు కేంద్రాలు గుర్తింపు

VZM: మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో 6 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్‌తో వీసీలో పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్, అయ్యప్పనగర్‌లోని ఏపీ మోడల్ స్కూల్, JNTU బ్లాక్ 1, 2 , ప్రభుత్వ బాలికల హై స్కూల్‌లలో నిర్వహించడం జరుగుతుందన్నారు.

February 26, 2026 / 06:35 PM IST

చదువొక్కటే మార్గం: అడ్లూరి లక్ష్మణ్

TG: ప్రతిభావంతులైన దళిత విద్యార్థులకు అన్ని రంగాల్లో సమాన గౌరవం లభించాలంటే చదువు ఒక్కటే మార్గమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. దళితులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. HYDలోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్‌‌ను మోడర్న్ కోచింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

February 26, 2026 / 06:35 PM IST

‘డూ ఆర్ డై’ మ్యాచ్.. టాస్ ఓడిన భారత్

చెన్నై వేదికగా భారత్, జింబాబ్వే మధ్య ‘డూ ఆర్ డై’ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైన భారత్‌కు, సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఓడితే భారత్ సెమీస్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ నేపథ్యంలో, టీమిండియా విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

February 26, 2026 / 06:35 PM IST

మార్కెట్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

HNK: పరకాల వ్యవసాయ మార్కెట్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్, 5,000 మెట్రిక్ టన్నుల గోదాం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పరకాల మార్కెట్ యార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను కల్పిస్తుందని అన్నారు.

February 26, 2026 / 06:34 PM IST

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: శ్రీనివాసరెడ్డి

ADB: ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదలందరికీ సంక్షేమం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.

February 26, 2026 / 06:33 PM IST

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలి: MLA

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ బానోత్ సునీత, వైస్ ఛైర్‌పర్సన్ డాక్టర్ అల్లం రమ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MHBD MLA డాక్టర్ భూక్య మురళి నాయక్ హాజరై వారిని శాలువతో ఘనంగా సన్మానించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని MLA సూచించారు.

February 26, 2026 / 06:33 PM IST

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సీతక్క

MLG: తాడ్వాయి మండలం మేడారంలో పలు గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి సీతక్క చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లును త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని, పూర్తయిన ఇళ్లుకు డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్ తదితరులు ఉన్నారు.

February 26, 2026 / 06:33 PM IST

శ్రీకృష్ణ దేవాలయ ప్రహరి గోడ ప్రారంభం

NGKL: పదర మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయం యొక్క ప్రహరీ గోడను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గురువారం ప్రారంభించారు. అనంతరం స్వామివారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిక్కుడు అనురాధ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

February 26, 2026 / 06:33 PM IST