• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సంక్షేమ పథకాలే లక్ష్యంగా ఫ్యామిలీ సర్వే’: కలెక్టర్

E.G: ఏపీ ప్రభుత్వం స్వర్ణగ్రామ/స్వర్ణవార్డ్ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాల పారదర్శక అమలు, లబ్ధిదారులకు వేగంగా సేవలు అందించేందుకు సమగ్ర డేటా సేకరించడమే ఈ సర్వే ఉద్దేశమని పేర్కొన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు తప్పనిసరిగా వివరాలు అందించాలన్నారు.

February 21, 2026 / 04:28 AM IST

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తికి తీవ్రగాయాలు

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సాయిబాబా ఆలయం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే లక్షెట్టిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి వివరాలు తెలిసిన వారు 8712656546 నంబర్‌ను సంప్రదించాలని SI తహసీనుద్దీన్ పేర్కొన్నారు.

February 21, 2026 / 04:24 AM IST

VIDEO: ‘బకింగ్ హోమ్ కెనాల్‌ను పునరుద్దరించాలి’

KKD: కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు శుక్రవారం అసెంబ్లీలో బకింగ్ హోమ్ కెనాల్ పునరుద్ధరణ అంశాన్ని లేవనెత్తారు. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు ఉన్న ఈ జలమార్గాన్ని అభివృద్ధి చేస్తే టూరిజం, రవాణా రంగాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. బ్రిటిష్ కాలంలో కీలకమైన ఈ కాలువ ప్రస్తుతం నిలిచిపోయిందని, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

February 21, 2026 / 04:20 AM IST

బంజారాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

JGL: బంజారాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని బంజారా భవన్‌లో శుక్రవారం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన బంజారా సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు.

February 21, 2026 / 04:10 AM IST

TGRSA కరీంనగర్ డైరీని ఆవిష్కరించిన అ. కలెక్టర్

KNR: తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కరీంనగర్ డైరీని అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ ఉద్యోగులు ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. శాఖ చరిత్ర, ముఖ్య సమాచారం, ఉపయోగకరమైన వివరాలతో డైరీని రూపొందించినట్లు తెలిపారు.

February 21, 2026 / 04:03 AM IST

నేడు దుగ్గిరాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

GNTR: దుగ్గిరాల మండల కేంద్రంతో పాటు చింతలపూడి గ్రామంలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ గోపి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పవర్ కట్ ఉంటుందని పేర్కొన్నారు. పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ఆయా గ్రామాల ప్రజలు, రైతులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

February 21, 2026 / 04:00 AM IST

బుల్లెట్లు స్వాధీనం.. పోలీసుల అదుపులో నిందితుడు

AP: తూ.గో. జిల్లాలో తుపాకీ బుల్లెట్లు కలిగి ఉన్న వ్యక్తిని కొవ్వూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీకి చెందిన సమీర్ హుస్సేన్ ఏడేళ్ల నుంచి దేచర్లలో నివాసం ఉంటున్నాడు. అయితే, అధికారుల సమాచారం మేరకు సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. అతని నుంచి 9MM పిస్టల్ బుల్లెట్లు 9, 315 రైఫిల్‌లో ఉపయోగించే పాయింట్ 8MM 6 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

February 21, 2026 / 03:58 AM IST

జింబాబ్వేతో మ్యాచ్.. ఆ ముగ్గురిపైనే దృష్టి

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 26న జింబాబ్వేతో టీమిండియా తలపడనుంది. అయితే, భారత బౌలర్లు ముగ్గురిపై దృష్టి పెట్టాలని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఓపెనర్ బ్రియాన్ బెనెట్‌ని త్వరగా ఔట్ చేస్తే జింబాబ్వేపై ఒత్తిడి పెంచడం ఖాయం. మరో ఓపెనర్ మరుమానితో పాటు కెప్టెన్ సికందర్ రాజ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురిని కట్టడి చేస్తే చాలని విశ్లేషకులు సూచించారు.

February 21, 2026 / 03:46 AM IST

జింబాబ్వే బ్యాటర్‌ అరుదైన ఘనత

టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెనెట్ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఈ ప్రపంచకప్‌లో మూడు మ్యాచుల్లో కలిపి బెనెట్ 175 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా, శ్రీలంకపై హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే, ఇతర జట్లలోని ఓపెనర్లు ఒక్కసారైనా పెవిలియన్‌కు చేరారు. కానీ, బెనెట్ ఒక్కసారి కూడా ఔట్ అవ్వలేదు.

February 21, 2026 / 02:59 AM IST

ఫిబ్రవరి 21: శనివారం పంచాంగం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం చవితి: మ.2:00 తదుపరి పంచమి రేవతి: రా.8:15 తదుపరి అశ్విని వర్జ్యం: ఉ.8:44 నుంచి 10:16 వరకు అమృత ఘడియలు: సా.5:57 నుంచి 7:29 వరకు దుర్ముహూర్తం: ఉ.6:28 నుంచి 8:00 వరకు రాహుకాలం: ఉ. 9:00 నుంచి 10:30 వరకు సూర్యోదయం: ఉ.6.28; సూర్యాస్తమయం: సా.5:59.

February 21, 2026 / 01:58 AM IST

నాకు పదవులపై ఆశ లేదు: జగ్గారెడ్డి

TG: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి.. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరారు. తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు వీహెచ్, కుసుమ కుమార్‌కి ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు. ‘నాకు పదవులపై ఆశ లేదు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నదే నా తపన. ఎన్నికల వల్ల నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యమైంది. పార్టీకి సంబంధించిన అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించాలి’ అని పేర్కొన్నారు.

February 21, 2026 / 01:38 AM IST

ఫిబ్రవరి 21: టీవీలలో సినిమాలు

స్టార్ మా: రాజా ది గ్రేట్(9AM); జీతెలుగు: రౌడీ బాయ్స్(9AM); ఈటీవీ: సందడే సందడి(9AM); స్టార్‌మా మూవీస్: సప్తగిరి LLB(7AM), వినయ విధేయ రామ(9AM), వీర సింహారెడ్డి(12PM), పోకిరి(3PM), K-ర్యాంప్(6PM), సలార్(9PM); జీ సినిమాలు: కొంచెం ఇష్టం కొంచెం కష్టం(7AM), విన్నర్(9AM), ఆర్యన్(12PM).

February 21, 2026 / 01:19 AM IST

వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయి: మంత్రి

AP: వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఏడాది మిర్చి అత్యధిక ధర పలుకుతోందని చెప్పారు. గుంటూరు మిర్చి యార్డును తరలించాలని ప్రతిపాదనలు ఉన్నాయని.. ఆధునిక యార్డు నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. అలాగే, గత పాలకులు మిర్చి యార్డును అవినీతికి నిలయంగా మార్చారని ఆరోపించారు. రైతు పరామర్శ పేరుతో యార్డుకు వచ్చి నానాయాగి చేశారని విమర్శించారు.

February 21, 2026 / 12:59 AM IST

ఫిబ్రవరి 21: చరిత్రలో ఈరోజు

➢1804: మొదటిసారి ప్రయాణించిన స్టీమ్ ఇంజిన్ రైలు➢2013: HYDలోని దిల్‌సుఖ్‌నగర్‌లో వరుస పేలుళ్లు➢1894: శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ జననం➢1945: భారత మాజీ క్రికెటర్ సుధీర్ నాయక్ జననం➢1951: శాస్త్రవేత్త దేవరాజు మహారాజు జననం➢2022: వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం➢అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

February 21, 2026 / 12:46 AM IST

రాళ్లతో దాడి చేసుకున్న రెండు వర్గాలు

TG: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఓ మార్ట్‌లో సౌండ్ సిస్టమ్ విషయంలో వివాదం తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

February 21, 2026 / 12:30 AM IST