TG: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి.. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరారు. తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు వీహెచ్, కుసుమ కుమార్‌కి ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు. ‘నాకు పదవులపై ఆశ లేదు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నదే నా తపన. ఎన్నికల వల్ల నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యమైంది. పార్టీకి సంబంధించిన అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించాలి’ అని పేర్కొన్నారు.