పసికూన ఒమన్‌పై ఆస్ట్రేలియా తన ప్రతాపాన్ని చూపింది. తొలుత ఒమన్‌ను 104 పరుగులకే ఆలౌట్ చేసిన ఆసీస్.. ఈ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 9.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆసీస్ ఓపెనర్లలో మార్ష్ (64*) మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, హెడ్ 32 పరుగులతో రాణించాడు. ఇప్పటికే సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా.. విజయంతో తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని ముగించింది.
AP: YCP పాలనలో జరిగిన అరాచకాలు మర్చిపోలేమని హోంమంత్రి అనిత అన్నారు. ‘అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును అవమానించారు. పవన్‌ను రోడ్డుపై కూర్చోబెట్టారు, బయటకు రానివ్వలేదు. లోకేష్ పాదయాత్రను అడ్డుకుని దాడికి యత్నించారు. ప్రజావేదిక కూల్చి శకలాలు తీయకుండా సైకోయిజం చూపించారు. పోలీసు వ్యవస్థను శాంతిభద్రతల కోసం కాకుండా రాజకీయాల కోసం పనిచేసేలా మార్చివేశారు’ అని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ఖరారైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆయన చైనాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను వైట్‌హౌస్ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి.
కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియను గుడివాడ డివిజనల్ పంచాయతీ అధికారి జి. సంపత్ కుమారి శుక్రవారం పర్యవేక్షించారు. గ్రామంలో జరుగుతున్న ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియను ఆమె పరిశీలించి, వసూళ్ల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పన్నుల వసూళ్లను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు అందించారు.
TG: ఈ రోజుల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మహిళల్లో అత్యంత సాధారణ సమస్య. సాధారణంగా జీర్ణవ్యవస్థ నుంచి బ్యాక్టీరియా మూత్రనాళంలోకి ప్రవేశించినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. మహిళల్లో పాయువు, మూత్రనాళం రెండూ దగ్గరగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా మహిళల్లో హార్మోన్ల మార్పులు కూడా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి.
పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని సిగరెట్ ప్యాకెట్‌పై ఉన్నప్పటికీ ఎవరూ దానిని పట్టించుకోరు. అయితే, ఇది ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ధూమపానం ఎముకల బలాన్ని తగ్గిస్తుంది. పగుళ్లకు గురిచేస్తుంది. దీంతోపాటు ఎముకల నిర్మాణానికి కీలకమైన హార్మోన్లను దెబ్బతీస్తుంది. ధూమపానం ఎముకలను దృఢంగా ఉంచే పోషకాలను కోల్పోయేలా చేస్తుంది’ అని చెప్పారు.
GNTR: జిల్లాలో శనివారం నిర్వహించనున్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ (SASA) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘జీరో లిటర్ గవర్నెన్స్’ థీమ్‌తో మున్సిపల్, పంచాయతీ శాఖలు సమన్వయంతో పని చేసి కార్యక్రమన్ని విజయవంతం చేయాలన్నారు.
AP: కూటమి పక్షాల నేతలు, మంత్రులు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించుకున్నారు. ఈ క్రమంలో మండలిలో వైసీపీ మహాపచారంపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు నియోజకవర్గాల్లోని వేంకటేశ్వర ఆలయాల్లో సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు. పార్లమెంట్ కేంద్రాల్లో ప్రెస్‌మీట్‌లు నిర్వహించాలన్నారు.
ప్రకాశం: తాడేపల్లిలోని ప్రకాశం జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి నివాసంలో ఈనెల 25న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.
అమెరికా సుప్రీంకోర్టు తీర్పును ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వ్యతిరేకించారు. తన దగ్గర ప్లాన్ బి ఉందని చెప్పారు. బ్యాకప్ ప్లాన్‌ను త్వరలో అమలు చేస్తానని స్పష్టం చేశారు. కాగా, అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ దేశం వసూలు చేసిన సుంకాలు దాదాపు 16 లక్షల కోట్లు తిరిగి చెల్లించాల్సిన స్థితిలో అమెరికా ఉంది.
తమలపాకు కేవలం పూజలకే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు కూడా నిలయం. భోజనం తర్వాత తమలపాకును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. తద్వారా గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇది సహజసిద్ధమైన మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తూ నోటి దుర్వాసనను అరికడుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చిగుళ్ల వ్యాధులను నివారిస్తాయి.
MDCL: ఆశా కార్యకర్తల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ CITU జిల్లా నాయకులు ఫిబ్రవరి 23న నిర్వహించే “ఛలో హైదరాబాద్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి ఎం. రేవతి కళ్యాణి, ఉపాధ్యక్షురాలు కె. కోమలత అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెమోరాండం సమర్పించారు.
PPM: మహిళా సంఘాలు సభ్యులు వివిధ పథకాల్లో తీసుకున్న రుణాలు ఏ ఏ రంగాలలో పెట్టుబడులు పెట్టారో అనే వాస్తవిక సమాచారం సేకరించాలని మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీ ఏం.సుధారాణి పేర్కున్నారు. శుక్రవారం సాలూరు మండలం బాగువలసలో ఈ నారిలు ద్వారా నిర్వహిస్తున్న జీవనోపాధులు సర్వేను ఆకస్మికంగా పరిశీలించారు. సిబ్బంది ఈ నారీలు చేస్తున్న సర్వే పరిశీలించి సూచనలు చేయాలన్నారు.
BDK: హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన పాఠశాల స్థాయి క్రీడా పోటీలలో పరుగు పందెంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కే. నాగరంజిత్ తన ప్రతిభను చాటిచెప్పాడు. పాక్షికంగా వికలాంగుడు అయినప్పటికీ చదువుల్లోను ఆటల్లోను ముందంజలో ఉండడం అతని ధైర్యసాహసాలకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ అభినందించారు.
Yoodesk Office Solutions సంస్థలో వీడియో కంటెంట్ క్రియేటర్&ఎడిటర్ ఇంటర్న్‌షిప్ అవకాశం అందుబాటులో ఉంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.21,000 వరకు స్టైఫండ్ ఉంటుంది. మార్చి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.