టీమిండియా స్పిన్నర్ రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహర్‌తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా SMలో వెల్లడించాడు. గత 15 నెలలుగా కోర్టులో ఈ న్యాయపోరాటం సాగిందని, చివరకు ఈ అధ్యాయం ముగిసిందని పేర్కొన్నాడు. టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ సోదరుడైన రాహుల్, గత ఏడాది జరిగిన IPL 2026 వేలంలో CSK రూ. 5.2 కోట్లకు కొనుగోలు సంగతి తెలిసిందే.
E.G: ఉద్యోగాల కోసం ఎదురు చూసే మనస్తత్వం నుంచి ఉద్యోగాలను సృష్టించే దిశగా యువత అడుగులు వేయాలని జిల్లా పారిశ్రామిక కేంద్రం జనరల్ మేనేజర్ కే.వాణిధర్ పిలుపునిచ్చారు. ఇవాళ రాజమండ్రిలో నిర్వహిస్తున్న ‘యువతలో నూతన ఆవిష్కరణలు, వ్యవస్థాపక నైపుణ్యాలు -అవకాశాలు & సవాళ్లు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే కేవలం వ్యాపారం కాదన్నారు.
W.G: తమకు ఆధార్ కార్డులు ఇప్పించాలని, శ్మశాన వాటిక సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీతారాంపురం సౌత్ ఎస్టీ కాలనీ వాసులు శుక్రవారం కమ్యూనిటీ భవనం వద్ద నిరసన చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్దిరాజు మాట్లాడుతూ.. కాలనీలోని యానాది సామాజిక వర్గానికి చెందిన పలువురికి ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవని ఆవేదన చెందారు.
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ చురుకైన అడుగులు వేస్తున్నారు. శుక్రవారం కామారెడ్డిలోని ఆయన నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వ్యవసాయ, సాగునీటి రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.
ASF: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు DIEO రాందాస్ శుక్రవారం తెలిపారు. 5,025 మంది మొదటి సంవత్సరంలో, 4,691 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ప్రతిరోజూ ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు’లో పలువురు దేశాధినేతలు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో 8 ఏళ్ల ఓ బుడతడు రణ్‌వీర్ సచ్‌దేవా ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సదస్సులో అతిపిన్న కీనోట్ స్పీకర్‌గా నిలిచి అందర్నీ ఆశ్చర్యపరచడమే కాకుండా.. సుందర్ పిచాయ్, శామ్ ఆల్ట్‌మన్‌లతోనూ భేటీ అయ్యారు.
CTR: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పోలీసులు శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రజల భద్రతను బలోపేతం చేయడం, నేరాలకు అడ్డుకట్ట వేయడం, శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ చేపట్టినట్టు వారు వెల్లడించారు. ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాలలో ఈ తనిఖీలు కొనసాగాయి.
ATP: CS కె.విజయానంద్ శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సానుకూల ప్రజా దృక్పథం, బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్వహణ, ఎస్సీ కార్పొరేషన్ రుణాల రికవరీ వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. విజయవాడ నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్, అనంతపురం నుంచి JC విష్ణుచరణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత ఉండాలని సూచించారు.
HYD: ఎండాకాలం వచ్చేస్తోంది.. మార్చి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. దీంతో సిటీలో బయటకు వెళ్లాలంటే భయమేసే పరిస్థితులు నెలకొంటాయి. అందుకే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్‌లో తిరిగే ఏసీ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. నగరంలో దాదాపు 90 ఏసీ బస్సులు సిటీలో తిరుగుతున్నాయి.
WGL: చెన్నారావుపేట మండలంలోని అక్కల్ చేడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, వాటర్ ప్లాంట్‌ను స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని, గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు.
ప్రకాశం: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే రూ.10వేలు జరిమానా తప్పదని హనుమంతునిపాడు SI మాధవరావు హెచ్చరించారు. వేములపాడులో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ఎస్సై నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
CTR: కుప్పం రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మల్లేష్ యాదవ్, తన సిబ్బందితో కలిసి కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. క్రమశిక్షణ, నైతిక విలువలను బలోపేతం చేయడం, లక్ష్య సాధనకు ప్రేరణ, సైబర్ అవగాహన, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై మార్గ నిర్దేశం చేశారు. యువత చదువు పట్ల బాధ్యతాయుతమైన ప్రవర్తనలు కలిగి ఉండాలని నొక్కి చెప్పారు.
యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు టీమిండియా బౌలింగ్ కోచ్ పూర్తి మద్దతు ప్రకటించాడు. అభిషేక్ ఫామ్‌పై జట్టులో ఎలాంటి ఆందోళన లేదని చెప్పాడు. అతని సామర్థ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం అభిషేక్ నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడని, త్వరలోనే అతను భారీ స్కోర్లతో ఫామ్‌లోకి వస్తాడని కోచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
CTR: పాలసముద్రంలోని అరుణోదయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఎస్సై రాజశేఖర్ రెడ్డి సందర్శించి విద్యార్థులతో సంభాషించారు. పోక్సో చట్టం శిక్షలు, పొగాకు వాడకం యొక్క ప్రభావాలు, మాదకద్రవ్యాలు ధైర్య స్పర్శ కార్యక్రమం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సైబర్ మోసాలకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.