• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభ

KMR: జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (CPIM) జిల్లా 3వ మహాసభ ప్రారంభమైంది. రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో జరిగిన సమావేశానికి జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు ఆధ్వర్యంలో 35 మంది నాయకులు హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ అనంతరం కార్మికుల హక్కులు, పోరాటాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

March 25, 2026 / 07:37 PM IST

మంత్రి డీఎస్‌బీవీ స్వామి కీలక సమావేశం

AP: మంత్రి డీఎస్‌బీవీ స్వామి అధ్యక్షతన సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కౌన్సిల్ భేటీ అయ్యింది. వృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతపై సమీక్ష నిర్వహించారు. వాట్సప్ మనమిత్ర ద్వారా ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాల పట్ల వృద్ధులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వృద్ధాశ్రమాల్లో వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

March 25, 2026 / 07:37 PM IST

పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన

CTR: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని బైరెడ్డిపల్లి ఎస్సై చందన ప్రియ హెచ్చరించారు. మండలంలోని కమ్మనపల్లి కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులకు బుధవారం పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియాను మంచి కోసమే ఉపయోగించాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించవచ్చని తెలిపారు.

March 25, 2026 / 07:36 PM IST

మిర్చి యార్డులో అవినీతి ఆరోపణలు

గుంటూరు మిర్చి యార్డును ఇవాళ పాలకవర్గ సభ్యులు పరిశీలించారు. ఈ క్రమంలో పలు అవకతవకలను గుర్తించారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై బిల్లులు లేకుండానే మిర్చి లారీలు బయటకు వెళ్తున్నట్లు వెల్లడైంది. దీనివల్ల యార్డు ఆదాయానికి నష్టం జరుగుతోందని తెలిపారు. అవినీతి అరికట్టేందుకు ఛైర్మన్ కుర్రా అప్పారావు ప్రయత్నిస్తున్నా పరిస్థితి దారుణంగా ఉందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 25, 2026 / 07:35 PM IST

పులికాట్‌లో తమిళ బోట్ల ప్రవేశంపై గట్టి నిఘా: ఎమ్మెల్యే

TPT: సూళ్లూరుపేట MLA నెలవల విజయశ్రీ నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మత్స్యకారుల సమస్యలపై సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పులికాట్ సరస్సులో తమిళనాడు బోట్ల అక్రమ ప్రవేశం వల్ల స్థానిక మత్స్యకారులు నష్టపోతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

March 25, 2026 / 07:35 PM IST

‘ఇందిర అంటే గౌరవమే.. తప్పేమీ మాట్లాడలేదు’

NZB: అసెంబ్లీలో ఇందిరపై తన వ్యాఖ్యల పట్ల దుమారం రేగడంపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి స్పందించారు. ‘ఇందిరా గాంధీ ఉక్కుమహిళ, ఆమెఅంటే మాకు గౌరవమే.. నేను తప్పేమీ మాట్లాడలేదు. అనేక పథకాలకు ఇందిరమ్మ పేరుపెట్టారు. ఇప్ప సారా తయారుచేస్తే ఆమె పేరుమాత్రం పెట్టొద్దనే చెప్పా, క్షమాపణ చెప్పాల్సి వస్తే చెప్తా, తమాషాచేయొద్దని మంత్రి నన్ను బెదిరిస్తున్నారా?’ అన్నారు.

March 25, 2026 / 07:35 PM IST

‘మాజీ మావోయిస్టు కుటుంబాలకు పూర్తి సహాయం అందిస్తాం’

ASF: మాజీ మావోయిస్టు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ హరిత వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లో SP నితికా పంత్‌తో కలిసి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. సందీప్ నగర్‌కు చెందిన బోయిని నగేష్ కుటుంబానికి త్వరలోనే ప్రభుత్వ లబ్ధి చేకూరుస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

March 25, 2026 / 07:33 PM IST

ముగ్గురు బాధితులకు మంత్రి ఆర్థిక సాయం

కోనసీమ: రామచంద్రపురంలో అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులకు బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ. 25,000 ఆర్థిక సహాయం అందించి పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి సామాజిక బాధ్యతగా తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తానన్నారు.

March 25, 2026 / 07:30 PM IST

మ్యాన్ హోల్, సెప్టిక్ క్లీనింగ్ పై స్పెషల్ డ్రైవ్

MDCL: ఘట్‌కేసర్‌ పరిధి వెంకటేశ్వర కాలనీ, ఆంజనేయ నగర్ ప్రాంతాల్లో మాన్‌హోల్, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్‌‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కాలనీలో పేరుకుపోయిన మురుగు సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ సిబ్బంది యంత్రాలతో శుభ్రపరిచే పనులు చేపట్టారు. డ్రైనేజీ లైన్లు క్లియర్ చేసి, నివాసితులకు ఉపశమనం కల్పించారు.

March 25, 2026 / 07:30 PM IST

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి: కలెక్టర్

GDWL: జిల్లాలో వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. బుధవారం గద్వాల కలెక్టరేట్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి 15 లోపు చేతి పంపులు, మోటర్లు, పైప్ లైన్‌లకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు.

March 25, 2026 / 07:30 PM IST

‘పేదల సంక్షేమానికి అనునిత్యం కృషి’

JGL: రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తుందని పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామంలో లబ్ధిదారులు చొప్పరి లక్ష్మి జయ కృష్ణ నిర్మించిన ఇందిర్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా అయన మట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు.

March 25, 2026 / 07:30 PM IST

కాళ్ల మండల పశువైద్యాధికారిగా యుగంధర్

W.G: కాళ్ల మండల పశువైద్యాధికారిగా డా. సీహెచ్. యుగంధర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చిన ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. పశువుల ఆరోగ్య సంరక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

March 25, 2026 / 07:29 PM IST

రైలులోనే సురక్షిత ప్రసవం

VSP: అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న గర్భిణికి రాయగడ సమీపంలో ప్రసవ వేదనలు రావడంతో టిటిఇ ఎస్. శ్రీకాంత్ వెంటనే స్పందించారు. పార్వతీపురం స్టేషన్‌లో వైద్య సహాయం ఏర్పాటుచేయగా, రైలులోనే ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు క్షేమంగా ఉండగా, ఆసుపత్రికి తరలించిన‌ట్టు విశాఖ రైల్వే అధికారులు తెలిపారు.

March 25, 2026 / 07:27 PM IST

రైలు కిందపడి తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి

అన్నమయ్య: ఓబులవారిపల్లి రైల్వే స్టేషన్‌లో బుధవారం నంద్యాల ప్యాసింజర్ రైలును ఎక్కే ప్రయత్నంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి రెడ్డయ ప్రమాదవశాత్తు రైలు కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి రైలు కిందపడ్డ అతడిని సురక్షితంగా బయటికి తీశారు. గాయపడిన విద్యార్థిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 25, 2026 / 07:26 PM IST

గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణ భూములు పరిశీలించిన జేసీ

ప్రకాశం: చీమకుర్తి మండలం నిప్పట్లపాడు గ్రామంలో ఫేజ్-3 కింద బెంగళూరు-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం చేపట్టవలసిన భూ సేకరణ ప్రక్రియలో భాగంగా బుధవారం జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి భూమిని పరిశీలించారు. భూమి సేకరణలో భాగంగా సంబంధిత భూ యజమానుల రికార్డులను పరిశీలించారు. జేసీ వెంట ఎస్‌డీసీ కళావతి, తహసీల్దార్ బ్రహ్మయ్య, రెవిన్యూ అధికారులు ఉన్నారు.

March 25, 2026 / 07:25 PM IST