సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వారు ప్రచారం చేసుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. ఎన్నికలు దగ్గరపడిన చివరి మూడు నెలల్లో అంతా మారిపోతుందని నాని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ కబడ్డీ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడ పోటీచేయాలనేది అధిష్టానం ...
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయనకు జెడ్ క్యాటగిరీ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రక్షణ కోసం ఏకంగా 33 మంది సీఆర్పీఎఫ్ కమెండోలను నియమించింది. అన్నామలై భద్రత కోసం ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అన్నామలై మాజీ ఐపీఎస్ అధికారి, ఆ తర్వాత బీజేపీలో చేరారు. థ్రెట్ ఉండటంతో ప్రస్తుతం ఆయనకు వై కేటగిరీ భద్రత ఉంది. హిట్ లిస్టులో...
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో….. షిర్డీ వెళ్తున్న సాయి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. షిర్డీ భక్తులు వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీ కొట్టింది. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకోగా… దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఠాణె నుంచి ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు సాయి భక్తులతో కలిసి బయలుదేరి వెళ్లింది. బస్సు నాసిక్ -షిర్డీ హైవే పై వెళ్తుం...
సంక్రాంతి పండగ వేళ రైల్వేశాఖ నగర వాసులకు ఊహించని షాకిచ్చింది. నేడు, రేపు (జనవరి 13, 14 తేదీల్లో నగరంలో) ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేసింది. జంట నగరాల పరిధిలో ట్రాక్ మెయింటెనెన్స్, ఆపరేషనల్ పనుల నేపథ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో పలు మార్గాల్లో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గాల్లో ఎంఎంటీఎస్ బంద్ లింగంపల్లి-నాంపల్లి రూట్‌లో 2, నాంపల్లి-లింగంపల్లి ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ది పక్కా ప్యాకేజీ రాజకీయమేనని అంబటి రాంబాబు శుక్రవారం నిప్పులు చెరిగారు. తాను సింగిల్‌గా వెళ్తే రాజకీయంగా వీరమరణమని తనకు కూడా అర్థమైందన్నారు. పోరాడే దమ్ములేక, విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు చెబుతుంటే దానిని భరించలేక ఇష్టారీతిన మాట్లాడటం ఏమిటన్నారు. అసలు పవన్ చేసిన పోరాటం ఏమిటన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి మీద కూడా పోరాటం చేశానని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్న...
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా బీజేపీతో పొత్తు ఉండాలంటే ఆ పార్టీ సరిగా ఉండాలని ఆయన అన్నారు. గౌరవం తగ్గకుండా ఉంటేనే పొత్తు ఉంటుందని, లేకపోతే ఒంటరి పోరాటమే అని పవన్ స్పష్టం చేసారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం అవసరం లేదని పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాను బాధ్యత త...
ప్రముఖ సోషలిస్ట్ నేత శరద్ యాదవ్ అనారోగ్యంతో గుర్గావ్‌లో ఫోర్టిస్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. శరద్ యాదవ్ నిన్న (గురువారం) రాత్రి కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. శరద్ యాదవ్ సోషలిస్ట్ నేత.. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కి ప్రియ శిష్యుడు. జేపీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సోషలిస్ట్ పార్టీ ఏర్పాటు చేయగా.. శరద్ యాదవ్ గురువు వెంటే ఉన్నారు. విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి....
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని శివచరణ్ రెడ్డి నీడలా వెంటాడుతున్నాడు. నాన్నా.. నేను ఎవరినీ అని అడుగుతున్నారు. మమ్మల్ని ఎందుకు దూరం పెట్టావు.. 18 ఏళ్ల నుంచి రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నాడు. నీ ఆస్తి, నీ అంతస్తు, రాజకీయ వారసత్వం అవసరం లేదు. కానీ ఒక కొడుకుగా గుర్తించు అని దీనంగా అడుగుతున్నారు. లేదంటే డీఎన్ఏ టెస్ట్‌కు వెళదాం అంటూ సవాల్ విసురుతున్నాడు. శివచరణ్ రెడ్డి లేఖ వదిలినా, మర...
టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ తన వేతాన్ని తగ్గించుకోవడానికి స్వచ్చంధంగా ముందుకు వచ్చారు. 40 శాతం వేతనం తగ్గించుకోనున్నారు. మార్చి 10వ తేదీన జరగనున్న ఇన్వెస్టర్ డేలో షేర్ హోల్డర్స్ అనుమతి లభించవలసి ఉంది. ఇప్పటికే షేర్ హోల్డర్లకు పంపిణ ప్రతిపాదనలలో కుక్ వేతన కోత అంశాన్ని చేర్చారు. టిమ్ కుక్ ఏడాదికి 99 మిలియన్ డాలర్ల వేతనం అందుకుంటున్నారు. 2023లో 49 మిలియన్ డాలర్లకు తగ్గించాలని నిర్ణయించారు....
పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ పేరును చంద్రసేనగా మార్చుకోవాలని, డబ్బుల కోసం జగన్‌పై, వైసీపీ నాయకులపై ఇంత నీచంగా మాట్లాడుతావా అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తనను, అంబటి రాంబాబును, ఇతర వైసీపీ నేతలను ఇష్టం వచ్చినట్లు తిడుతా అంటే ఎలా అని, వారి కులం కాబట్టి మాపై ఆయనకు హక్కు ఉందన్నట్లుగా మాట్లాడుతారా అని నిలదీశారు. తన పేరు తెలియనట్లుగా మంత్రి అంటూ మాట్లాడుత...
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ హంగామా స్టార్ట్ అయిపోయింది. మెగాభిమాని బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ కమిషనర్ ఆఫీసర్‌గా నటించాడు. అయితే వాల్తేరు వీరయ్యలో రవితేజ స్థానంలో ముందుగా మెగా హీరో తీసుకోవాలని అనుకున్నారట. కానీ జస్ట్ మిస్ అయిందని అంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా సాగుత...
ప్రస్తుతం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య హంగామా ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. ముందు నుంచి ప్రతి విషయంలోను పోటీ పడుతు వచ్చారు చిరు బాలయ్య. అందుకు తగ్గట్టే మైత్రీ మూవీ మేకర్స్ కూడా.. అటు ఫ్యాన్స్.. ఇటు చిరు, బాలయ్యను ఏ మాత్రం హర్ట్ చేయకుండా భలేగా బ్యాలెన్స్ చేశారు. ఫస్ట్ లుక్ మొదలుకొని.. రిలీజ్ వరకు పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగారు. అలాగే సినిమాల పై భారీ హైప్ క్రియేట్ చేశారు. ఈ విషయంలో మెగా, [&hel...
ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చల్లబడ్డారా.. అంటే అవుననే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. కొత్తగూడెం పర్యటనలో తుమ్మల మొదటి నుండి చివరి వరకు అధినేత కేసీఆర్ వెంటే ఉన్నారు. ఆయనను సీఎం ఆత్మీయంగా పలకరించారు. కలెక్ట...
సంక్రాంతి పందెంకోడిలా థియేటర్లలోకి దూసుకొచ్చిన బాలకృష్ణ మూవీ వీరసింహారెడ్డి బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. నందమూరి అభిమానుల అంచనాలు రీచ్ అయ్యి.. నీరాజనాలు అందుకుంటోంది. అయితే.. వీరసింహారెడ్డి వీర విహారానికి ఓ థియేటర్ యాజమాన్యం బ్రేక్ వేసింది. అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో బాలయ్య యాక్టింగ్, డైలాగులు, డ్యాన్సులు చూసి వీర లెవల్లో ఊగిపోతున్నారట. జై బాలయ్య అరుపులతో థియేటర్లను హోరెత్తిస్తున...
జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. రోడ్డుపై సభలు, సమావేశాలు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 23వ తేదీన జీవో నెంబర్ 1ని తీసుకొచ్చింది. అయితే ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఏపీ హైకోర్టు ఈ నెల 23వ తేదీ వరకు జీవో 1ని సస్పెండ్ చేసింది. జనవరి 20 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1న మీద ప్రతిపక్షాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి....