Ten people died in Road accident At Nashik-Shirdi highway
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో….. షిర్డీ వెళ్తున్న సాయి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. షిర్డీ భక్తులు వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీ కొట్టింది. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకోగా… దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఠాణె నుంచి ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సు సాయి భక్తులతో కలిసి బయలుదేరి వెళ్లింది. బస్సు నాసిక్ -షిర్డీ హైవే పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది.ఈ ఘటనలో 10మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలలో ఏడగురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.