టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ తన వేతాన్ని తగ్గించుకోవడానికి స్వచ్చంధంగా ముందుకు వచ్చారు. 40 శాతం వేతనం తగ్గించుకోనున్నారు. మార్చి 10వ తేదీన జరగనున్న ఇన్వెస్టర్ డేలో షేర్ హోల్డర్స్ అనుమతి లభించవలసి ఉంది. ఇప్పటికే షేర్ హోల్డర్లకు పంపిణ ప్రతిపాదనలలో కుక్ వేతన కోత అంశాన్ని చేర్చారు. టిమ్ కుక్ ఏడాదికి 99 మిలియన్ డాలర్ల వేతనం అందుకుంటున్నారు. 2023లో 49 మిలియన్ డాలర్లకు తగ్గించాలని నిర్ణయించారు. షేర్ హోల్డర్ల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ తెలిపింది.
గత క్యాలెండర్ ఏడాదిలో 83 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డ్స్, 12 మిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలు, మూడు మిలియన్ డాలర్ల బేసిక్ శాలరీ తీసుకున్నారు. ఇతర సదుపాయాల కోసం మరో 46వేల డాలర్లను పొందారు. వేతనాలపై గత ఏడాది నిర్వహించిన సే ఆన్ పే ఓటింగ్లో 64 శాతం మంది షేర్ హోల్డర్లు మాత్రమే కుక్ వేతన ప్యాకేజీకి సానుకూలంగా స్పందించగా, అంతకుముందు 95 శాతం మంది సుముఖత వ్యక్తం చేశారు.