»Apple Watch That Saved A Womans Life What Is The Ceo
Apple watch: ఓ మహిళా ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ ఏమన్నారంటే?
యాపిల్ స్మార్ట్ వాచ్ ఓ మహిళా జీవితాన్ని కాపిడింది. వాచీలో ఉండే పల్స్ రేట్ ఫీచర్‌తో ఆమె ప్రాణాలు దక్కించుకుంది. దీనిపై కంపెనీపై యాపిల్ సీఈఓ స్పందించడం విశేషం.
Apple watch that saved a woman's life.. What is the CEO?
Apple watch: యాపిల్ వాచ్ (Apple watch) ఓ మహిళ ప్రాణాల్ని రక్షించింది. దానిలో ఉన్న పల్స్ రేట్ ఫీచర్‌తో ముందుగానే అలెర్ట్ అయిన ఆ మహిళ సరైన సమయంలో హాస్పటల్‌కు వెళ్లింది. దాంతో ఆమె ప్రాణాలు దక్కించుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో పాలసీ పరిశోధనలో పనిచేస్తున్న స్నేహ సిన్హా అనే మహిళ తనకు జరిగిన అనుభవాన్ని ఓ ఆంగ్లమీడియాతో పంచుకున్నారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని, ఎక్కువ ప్రయాణాలు చేయడం, ఎత్తైన పర్వత ప్రాంతాల్లోనూ ట్రెక్కింగ్ చేస్తూ.. రోజుకు 15 వేల నుంచి 16 వేల అడుగుల నడుస్తా అని చెప్పారు. ఆక్సిజన్ తక్కువగా ఉండే ఎత్తైన ప్రదేశాల్లో సైతం తనకు ఎలాంటి ప్రాబ్లమ్ కాలేదని చెప్పారు.
ఒక రోజు పనిముగించుకొని ఇంటికి వస్తుంటే గుండులో దడపుట్టిందని, తన చేతికి ఉన్న వాచ్‌లో హాట్ రేట్ ఎక్కువగా చూపిస్తుందని చెప్పారు. దాంతో భయం పెరిగింది. గట్టిగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించానని, ఆ సమయంలో హాట్ రేట్ మరీ ఎక్కువైందని చెప్పారు. దాంతో తన స్నేహితుడికి ఫోన్ చేసి ఆసుపత్రికి వెళ్తున్నట్లు చెప్పి, తాను హాస్పటల్‌కు వెళ్లేంత వరకు స్మార్ట్ వాచ్‌లో పల్స్ చూస్తూనే ఉన్నా అని చెప్పారు. ఆసుపత్రికి వెళ్లిన తరువాత సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వలన తన ప్రాణాలు దక్కించుకున్నట్లు సిన్హా చెప్పారు. ఇదే విషయాన్ని సీఈఓ టిమ్ కుక్‌తో ఇ-మెయిల్ ద్వారా పంచుకున్నారు. దీనిపై ఆయన స్పందించారు. సరైన సమయంలో వైద్యం అందినందుకు సంతోషంగా ఉందని రిప్లై ఇచ్చారు.