Do you know the features of Fire Bold Destiny Smart Watch?
Smart Watch: ఫైర్-బోల్ట్ కంపెనీలు స్మార్ట్ వాచ్ ప్రియుల కోసం ఇటీవల గాడ్జెట్స్ ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కంపెనీ నుంచి అత్యద్భుతమైన ఫీచర్లతో ఫైర్ బోల్డ్ డెస్టినీ స్మార్ట్ వాచ్(Fire Boltt Destiny Smart Watch)ని రీజనబుల్ ధరలో త్వరలోనే లాంచ్ చేయబోతుంది. మరి ఈ వాచ్ ఫీచర్లు(features), స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం.. ఫైర్-బోల్ట్ డెస్టినీ స్మార్ట్‌వాచ్ సిల్వర్ కలర్‌తోపాటు కస్టమర్లను ఆకర్షించే ఇతర రంగులలో కూడా అందుబాటులో రానున్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ ఆన్ లైన్ మార్కెటింగ్ కంపెనీ వెబ్సైట్లలో అందుబాటులో ఉండనుంది. ఈ వాచ్ ఇండియాలో రూ.1,799కు లభించనుంది.
స్మార్ట్‌వాచ్ 1.39 అంగుళాల టచ్ డిస్ప్లేతో బ్లూటూత్ 5.0 వర్షన్లో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌కు స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తోంది. దీంతో వినియోగదారులకు కాల్ చేయడానికి.. స్వీకరించడానికి ఈజీగా ఉంటుంది. హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ కోసం SpO2 ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. అదనంగా క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంటింగ్, టైమర్, అలారం, స్టాప్‌వాచ్ వంటి ఆప్షన్స్ వాచ్‌లో ఉన్నాయి. స్క్రాచ్ రెసిస్టెన్సీ, వాటర్ రెసిస్టెన్సీ దీని ప్రత్యేకత.