»Google Pixel Watch 2 In The Market Smart Features
Google Pixel Watch 2: మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్ వాచ్2..ఫీచర్లు చుశారా?
గూగుల్ నుంచి మరికొన్ని అద్భుతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి రాబోతుంది. ఇది మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఎల్టీఈ, వైఫై రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండగా భారత్‌లో మాత్రం ఒక్కటే విడుదల కానుంది.
Google Pixel Watch 2 in the market.. Smart features
Google Pixel Watch 2: గూగుల్ పిక్సెల్ వాచ్ 2 (Google Pixel Watch 2) ప్రపంచవ్యాప్తంగా బుధవారం విడుదలైంది. పిక్సెల్ 8 సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు ఈ గడియారాలను విడుదల చేశారు. ఇంతకు ముందున్న పిక్సెల్ వాచ్‌తో పోలిస్తే ఈ సారి చాలా ఫీచర్లను చేర్చినట్లు గూగుల్ తెలిపింది. క్వాల్కామ్ 5100 చిప్సెట్తో వచ్చిన ఈ వాచ్ వచ్చేవారం నుంచి మార్కెట్లోకి రానుంది. గూగుల్ పిక్సెల్ వాచ్ 2 మ్యాట్ బ్లాక్, షాంపెయిన్ గోల్డ్, పాలిష్డ్ సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ బ్యాండ్‌లో అనేక రకాల ఆప్షన్లు ఉండడం విశేషం.
ఎల్టీఈ, వైఫై రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. భారత్‌లో ఎల్టీఈ మాత్రమే విడుదలైంది. దీని ధర రూ.39,900. అక్టోబర్ 13 నుంచి ఇది ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో అందుబాటులోకి రానుంది. అయితే, పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో కొనుగోలు చేసేవారికి పిక్సెల్ వాచ్ 2ను ఫ్లిప్‌కార్ట్ రూ.19,999కే అందిస్తోంది. పిక్సెల్ వాచ్ 2 (Google Pixel Watch 2) 3డీ కర్వ్డ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో వస్తోంది. దీని గరిష్ఠ బ్రైట్నెస్ 1,000 నిట్స్ వరకు ఉండడం విశేషం. స్క్రీన్‌పై కార్నింగ్ గొరిల్లా గ్లాస్5 కూడా వస్తోంది. క్వాల్కామ్ 5,100 ప్రాసెసర్‌తో వస్తుంది. 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, వేర్ ఓఎస్ 4.0 ఔట్ ఆఫ్ బాక్స్ ఓఎస్‌ను అందిస్తున్నారు.
పిక్సెల్ వాచ్ 2లో నావిగేటర్, అల్టీమీటర్, యాక్సెలోమీటర్, గైరోస్కోప్, యాంబియెంట్ లైట్ సెన్సర్, బారోమీటర్, మ్యాగ్నెటోమీటర్ వంటి సెన్సర్లు ఉన్నాయి. వీటితో పాటు ఆక్సిజన్ మానిటర్, ఈసీజీ మానిటర్, హార్ట్‌రేట్ సెన్సర్, స్కిన్ టెంపరేచర్ వంటి ఫీచర్లున్నాయి. మొత్తం 40 స్పోర్ట్స్ మోడ్లు అందుబాటులో ఉన్నాయి. డైలీ రెడీనెస్ స్కోర్, స్లీప్ స్కోర్, చార్ట్ యాక్టివ్ జోన్ మినిట్స్, స్లీప్ ప్రొఫైల్ వంటి హెల్త్, ఫిజికల్ యాక్టివిటీ సమాచారాన్ని కూడా అందిస్తుంది.
ఇది 306mAh బ్యాటరీ సౌకర్యంతో అందుబాటులో ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఉంచితే బ్యాటరీ లైఫ్ 24 గంటల వరకు ఉంటుందని గూగుల్ తెలిపింది. గతంలో వచ్చిన పిక్సెల్ వాచ్‌లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండగా.. తాజా వాచ్‌లో కాంటాక్ట్ పిన్ ద్వారా ఛార్జ్ చేసుకునే ఆప్షన్‌ను ఇచ్చారు. పిక్సెల్ వాచ్2లో ఇన్ మైక్, స్పీకర్, సైడ్ బటన్ ఉన్నాయి. బ్లూటూత్ 5, వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.