»Madhya Pradesh Notifies 35 Quota For Women In Govt Jobs
Shivaraj సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్
ఎన్నికల వేళ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నీ ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ మహిళలకు ఇస్తామని స్పష్టంచేసింది. ఇందుకోసం నోటిఫికేషన్ కూడా జారీచేసింది.
Madhya Pradesh Notifies 35% Quota For Women In Govt Jobs
Madhya Pradesh Notifies Women Govt Jobs: అసెంబ్లీ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అటవీ శాఖ ఉద్యోగాలు మినహా.. మిగిలిన అన్ని నియామకాల్లో 35 శాతం కోటా మహిళలకు కల్పించనుంది. మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (మహిళల నియామకం కోసం ప్రత్యేక నిబంధన) రూల్స్ 1997కి సవరణ ప్రవేశపెట్టి రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించింది.
రాష్ట్రంలో గల ఏ సర్వీస్ అయినా.. రూల్స్ ఏమీ ఉన్నప్పటికీ రిక్రూట్ మెంట్ సమయంలో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఇందులో అటవీశాఖను మినహాయించారు. ఎందుకంటే మహిళలు అడవీలో.. బీట్ కానిస్టేబుల్ ఉద్యోగాలు చేయలేనందున.. వారికి ఆ నియామకాల్లో రిజర్వేషన్ కల్పించలేదు. మహిళా రిజర్వేషన్ గురించి ఇటీవల సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పోలీసు, ఇతర ప్రభుత్వ నియామకాల్లో 35 శాతం.. టీచర్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటన చేశారు. 35 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు.
ఉద్యోగాల్లో రిజర్వేషన్ కాకుండా లడ్లీ బహ్నా యోజన కింద మహిళల సంక్షేమం కోసం నిధులు విడుదల చేస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతీ నెల లబ్దిదారుడికి రూ.1250 అందజేస్తారు. ఈ నెల 10వ తేదీన నగదు బదిలీ చేయాల్సి ఉంది..బుధవారం ఆ ప్రక్రియను చేపడుతున్నామని వివరించారు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవనుందని.. అందుకే ముందుగానే విడుదల చేస్తున్నామని తెలిపారు.
ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నిక జరగనుంది. రాష్ట్రంలో మహిళ ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారు. సో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో శివరాజ్ సింగ్ ఉన్నారు. తిరిగి తమ ప్రభుత్వం ఏర్పడేందుకు రిజర్వేషన్, నిధుల జమ దోహద పడతాయని ఆయన భావిస్తున్నారు.