Another record holder is Savitri Jindal the richest woman in the india
దేశంలోని అత్యంత సంపన్న మహిళా వ్యాపారవేత్త సావిత్రి దేవి జిందాల్(Savitri Jindal)సంపద వార్షిక ప్రాతిపదికన 4.82 బిలియన్ డాలర్లు భారీగా పెరిగింది. దీంతో ఆమె ఇప్పుడు భారతీయ బిలియనీర్ల జాబితాలో 7వ స్థానానికి చేరుకున్నారు. అంతేకాదు ఆమె సంపద పరంగా కమోడిటీ మార్కెట్ వెటరన్, స్టీల్ కింగ్ బిలియనీర్ లక్ష్మీ మిట్టల్‌ను కూడా అధిగమించారు. జిందాల్ గ్రూప్ ఎమెరిటస్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్ వ్యాపారం కూడా కమోడిటీ మార్కెట్‌కి సంబంధించినది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం సావిత్రి జిందాల్ ఇప్పుడు 18.7 బిలియన్ డాలర్ల నికర విలువతో భారతీయ బిలియనీర్లలో ఏడవ స్థానంలో ఉన్నారు. అదే సమయంలో లక్ష్మీ మిట్టల్ మొత్తం సంపద 17.2 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్ల ర్యాంకింగ్‌లో సావిత్రి జిందాల్ 82వ స్థానంలో ఉన్నారు. కాగా లక్ష్మీ మిట్టల్ 98వ ర్యాంక్‌లో ఉన్నారు.
73 ఏళ్ల సావిత్రి జిందాల్ సంపదకు ప్రధాన కంపెనీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ మూడింట ఒక వంతు సహకారం అందించింది. JSW ఎనర్జీ, జిందాల్ స్టీల్ & పవర్లో వాటా విలువలు వరుసగా $4.2 బిలియన్, $3.0 బిలియన్లుగా ఉన్నాయి. JSW ఎనర్జీ స్టాక్ 2023లో ఇప్పటివరకు 46% లాభంతో అత్యధికంగా లాభపడింది. దీని తర్వాత జిందాల్ స్టీల్ అండ్ పవర్ 17% పెరిగింది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ముందంజలో ఉన్నారు. ముఖేష్ అంబానీ సంపద 87 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతదేశంలో రెండో అత్యంత సంపన్న బిలియనీర్ గౌతమ్ అదానీ. అదానీ సంపద $63.1 బిలియన్ డాలర్లు. దీని తర్వాత టాప్ 100 బిలియనీర్ల ర్యాంకింగ్‌లో షాపూర్ మిస్త్రీ 40వ స్థానంలో, శివ్ నాడార్ 46వ స్థానంలో, అజీమ్ ప్రేమ్‌జీ 59వ స్థానంలో, సైరస్ పూనావాలా 81వ స్థానంలో ఉన్నారు. 82వ స్థానంలో సావిత్రి జిందాల్‌తో పాటు, దిలీప్ షాంఘ్వీ 86వ స్థానంలో ఉన్నారు. కాగా రాధాకిషన్ దమానీ ర్యాంకింగ్ 94వ స్థానంలో ఉంది. ఇది కాకుండా లక్ష్మీ మిట్టల్ 98వ స్థానంలో ఉన్నారు.