»Apple Watch Recovered From The Ocean After One Year And It Still Works
Apple Watch : సముద్రంలో పడిపోయిన యాపిల్ వాచ్ ఏడాదిన్నర తర్వాత పని చేస్తూ దొరికింది!
చాలా మందికి యాపిల్ ఉత్పత్తుల మీద చాలా మోజు ఉంటుంది. ఎందుకంటే వాటి క్వాలిటీ అంత ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. దాన్ని ప్రూవ్ చేసే ఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. అదేంటంటే?
Apple Watch : చాలా మందికి యాపిల్ గాడ్జెట్‌లంటే చెప్పలేనంత ఇష్టం ఉంటుంది. ఐఫోన్లు, ఐప్యాడ్లు, ఐవాచ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. వాటి బిల్ట్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుందని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే ఆ క్వాలిటీ ఏ రేంజ్లో ఉంటుందో ప్రూవ్ చేసే ఘటన ఒకటి అమెరికాలో జరిగింది. అమెరికాకి చెందిన ఓ వ్యక్తి సముద్రంలో(Ocean ) తన చేతికి ఉన్న యాపిల్ వాచ్‌ని(Apple Watch) పోగొట్టుకున్నాడు. ప్రమాదవశాత్తూ అది నీటిలో పడిపోయింది.
అమెరికాకు చెందిన జారెక్ బ్రిక్ 2022 జూన్‌లో కరేబియన్ ఐలాండ్స్‌కి పర్యాటకం కోసం వెళ్లాడు. అక్కడి సముద్రంలో స్క్యూబా డైవింగ్‌కి వెళ్లి తిరిగి వచ్చే సరికి తన చేతికున్న యాపిల్ వాచ్(Apple Watch) లేదు. అది సముద్రంలో పడిపోయింది. తాను సముద్రపు అందాలను చూస్తూ మైమరిచిపోయి ఉండిపోయానని, అదే సమయంలో తన యాపిల్ వాచ్ పడిపోయిందని అతడు చెప్పుకొచ్చాడు.
వాచ్ సముద్రంలో పడిపోయినప్పటికీ ఎక్కడో అతడికి చిన్న ఆశ ఉంది. దీంతో ‘ఫైండ్ మై నెట్వర్క్’లో వాచ్ పోయినట్లుగా మార్క్ చేసి వదిలేశాడు. తన యాపిల్ వాచ్(Apple Watch) పడిపోయిన ప్రాంతానికి దగ్గరలో ఉండే ఓ వ్యక్తికి అది దొరికింది. ఆ వ్యక్తి నుంచి బ్రిక్కు వాయిస్ మెయిల్ వచ్చింది. వాచీ దొరికినట్లుగా ఆ వ్యక్తి బ్రిక్కి చెప్పాడు. ‘ఫైండ్ మై నెట్వర్క్’ ఫీచర్‌పై బ్రిక్ సెట్ చేసిన మెసేజ్ డిస్ప్లే కావడంతో ప్రస్తుతం వాచ్ అతడికి చేరుకుంది. అన్నాళ్లు సముద్రంలో ఉన్నా ఆ వాచ్ పని చేస్తూనే ఉంది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వెళ్లింది.