»Apple Watch That Saved The Life Of The Road Accident Victim
Apple watch : రోడ్డు ప్రమాద బాధితుడిని ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్
ఆపిల్ వాచ్ ధరించిన వ్యక్తి ఏదైనా వాహనంలో రోడ్డు ప్రమాదానికి గురైతే ఈ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అతడి లొకేషన్ సమాచారాన్ని ఎమర్జెన్సీ సర్వీస్ కు పంపిస్తుంది.
అమెరికా(America)లోని విస్కాన్సిన్ లో ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుపై బోల్తా కొట్టింది. తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. డ్రైవర్ తీవ్రగాయాలతో స్పృహతప్పి పడిపోయాడు.ఆ సమయంలో ఆపిల్ వాచ్ (Apple Watch) ధరించి ఉండడం అతడి అదృష్టం అనుకోవాలి. ఆపిల్ వాచ్ లోని క్రాష్ డిటెక్షన్ ఫీచర్ యాక్టివేట్ అయి..రోడ్డు ప్రమాద సమాచారాన్ని 911 ఎమర్జెన్సీ సర్వీస్ కు చేరవేసింది. వెంటనే స్పందించిన అధికారులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకుని హెలికాప్టర్ (Helicopter) ద్వారా ఆ డ్రైవర్ ను తరలించారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాపిల్ వాచ్ అతడి ప్రాణాలను కాపాడింది.
ప్రీమియం బ్రాండ్ స్మార్ట్‌వాచ్‌లు అద్భుతమైన హెల్త్ ట్రాకింగ్ (Health tracking) ఫీచర్లతో వస్తాయి. ఇవి యూజర్ల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడూ పర్యవేషిస్తుంటాయి. ఏవైనా అనారోగ్యాలను గుర్తిస్తే, అలర్ట్ ఇస్తాయి. ఇప్పటికే యాపిల్ వాచ్‌లు ఇలాంటి హెచ్చరికలతో ఎంతోమంది యూజర్ల ప్రాణాలు నిలబెట్టాయి.గతంలో ఓసారి ఓ వ్యక్తి గుండెపోటు(heart attack)కు గురయ్యే ప్రమాదాన్ని ముందే గుర్తించిన ఆపిల్ వాచ్.. ఆ వ్యక్తిని అప్రమత్తం చేయడంతో ప్రాణాపాయం తప్పిన ఘటన చాలామందికి తెలిసే ఉంటుంది. తాజాగా ఆపిల్ వాచ్ మరోసారి ప్రాణాపాయాన్ని నివారించింది. ఆపిల్ వాచ్ లో అనేక స్మార్ట్ ఫీచర్లు(Smart features) ఉంటాయి. ఇందులోని క్రాష్ డిటెక్షన్ ఫీచర్ తాజాగా ఓ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టింది.