ఢిల్లీ నగరంలో ఫుడ్ డెలివరీ(Food delivery)లు, అమెజాన్ డెలివరీల వంటి వాణిజ్య డెలివరీలు NDMC ప్రాంతంలో ఏమాత్రం అనుమతించబోమని పోలీస్ స్పెషల్ కమిషనర్ ఎస్. ఎస్ యాదవ్ వెల్లడించారు. అదేవిధంగా సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 10 అర్ధరాత్రి వరకు ఢిల్లీ(Delhi)లోకి వాహనాల ప్రవేశంపై నిషేధం ఉంటుందని గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. G20 అంతర్జాతీయ సదస్సు సందర్భంగా ఢిల్లీ పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు.అయితే, నగరంలో లాక్ డౌన్ ఊహాగానాలను తోసిపుచ్చుతూ.. పోలీసులు G20 సమ్మిట్(G20 Summit) సందర్భంగా లాక్డౌన్ ఉండదని ఇప్పటికే X (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.సెప్టెంబర్ 8న ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానాలను అమలు చేయాలని వివిధ కంపెనీలకు వారు సూచించారు.
ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబరు 8 నుండి సెప్టెంబర్ 10 వరకు దేశ రాజధానిలో పబ్లిక్ హాలిడే (Public holiday)ను ప్రకటించింది. సమ్మిట్ సందర్భంగా ఢిల్లీ ‘హై అలర్ట్’ ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. జి 20 శిఖరాగ్ర సమావేశానికి అంతరాయం కలిగించమని ఖలిస్థానీ వేర్పాటువాది కశ్మీరీ ముస్లింలను కోరాడు. జి20 సమ్మిట్‌కు అంతరాయం కలిగించేందుకు కశ్మీరీ ముస్లిం(Kashmiri Muslim)లను ఢిల్లీకి వెళ్లాలని కోరుతూ సిక్కులు ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.జి20 సదస్సు ఇక్కడ జరగడం ఇదే తొలిసారి కావడంతో భారత్‌కు ఇది చారిత్రాత్మక ఘట్టం. సదస్సు సందర్భంగా ఢిల్లీలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చొరబాట్లు, ఉగ్రవాద చర్యలు,విధ్వంసం జరగకుండా చూసేందుకు 1,30,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నట్లు ఢిల్లీ పోలీసులు (Police) తెలిపారు. ఈవెంట్ వేదికల వద్ద బుల్లెట్ ప్రూఫ్ (Bullet proof) భద్రతను ఏర్పాటు చేశారు.