GDL: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం ఉండవెల్లి మండలంలో కొనసాగుతున్నాయి. మండలంలోని పుల్లూరు గ్రామంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సతీమణితో కలిసి ఓటు వేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం సమీపంలో మీడియాకు సిరా గుర్తును చూయించారు. ఓటు కలిగిన ప్రతి ఒక్కరు నిర్భయంగా వారికి నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.