SRD: మండల కేంద్రమైన కంగ్టి మాజీ సర్పంచ్, సిద్దేశ్వర ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ గాదె బాబు సెట్ (85) బుధవారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో చనిపోయారని కుటుంబీకులు తెలిపారు. ఈయన మృతి పట్ల కంగ్టిలోని పలు పార్టీల నాయకులు, గ్రామస్తులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.