VZM: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంను రద్దు చేస్తూ దాని స్థానంలో వికసిత భారత్ రోజ్ గార్, ఆజీవికా హామీ మిషన్-2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త బిల్లుని తీసుకురావడం కరెక్టు కాదని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మాగాంధీ పేరుని కొత్త చట్టం నుండి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.