KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 388 గ్రామ పంచాయతీలకు, 1580 వార్డులకు జరిగిన మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ముందుగా వార్డు సభ్యుల బ్యాలెట్లను లెక్కించనున్నారు. 25 ఓట్లను ఓ కట్టగా కట్టి, వార్డుల వారీగా లెక్కించనున్నారు. వార్డులు ముగిసిన వెంటనే సర్పంచ్ కౌంటింగ్ నిర్వహిస్తారు.