AP: రాష్ట్ర సచివాలయంలో ఎన్నికల సందడి మొదలైంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉన్నతస్థాయి ఉద్యోగుల సంఘం కార్యవర్గ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సచివాలయ ఉద్యోగ సంఘం కార్యవర్గంలో అత్యంత కీలకమైన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పదవులతో పాటు ఇతర కార్యవర్గ సభ్యుల పదవుల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఈనెల 29న జరగనున్నాయి.