AP: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి ఆవరణలో నూతన భవనాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. రూ.10.65 కోట్లతో నిర్మించిన కేంద్రీయ ఔషధ గిడ్డంగిని, రూ.4.40 కోట్లతో నిర్మించిన రోగుల సహాయకుల వసతి భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. స్విమ్స్‌లో పనులు వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు.