WG: ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారానికే ‘ప్రజా దర్బార్’ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఇవాళ పెదఅమిరంలోని తన కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడమే ధ్యేయంగా అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు.