Nvidia : యాపిల్ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత విలువైన రెండో కంపెనీగా ఎన్విడియా
ప్రాసెసర్ల తయారీ కంపెనీ ఎన్విడియా యాపిల్ కంపెనీని వెనక్కి నెట్టింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన రెండో కంపెనీగా అవతరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Nvidia Second Most Valuable Company : ప్రపంచంలోనే అత్యంత విలువైన రెండో కంపెనీగా ఎన్విడియా అవతరించింది. ఇప్పటి వరకు మొదటి స్థానంలో మైక్రోసాఫ్ట్, రెండో స్థానంలో యాపిల్( APPLE) సంస్థలు ఉండేవి. ఇప్పుడు ఎన్విడియా(NVIDIA) సంస్థ యాపిల్ని వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. దీంతో యాపిల్ మూడో స్థానానికి పడిపోయింది.
ఎన్విడియా(NVIDIA) సంస్థ తయారు చేస్తున్న ప్రాసెసర్లకు డిమాండు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో 2024 సంవత్సరంలోనే దీని షేరు విలువ 147 శాతం పెరిగింది. దీంతో ఇది రెండో స్థానానికి చేరుకోగలిగంది. వాస్తవానికి ఈ సంస్థను 1993లో ప్రారంభించారు. ఇది తొలుత కంప్యూటర్లలో ఒక రకమైన గ్రాఫిక్స్‌ను ప్రాసెస్ చేసేందుకు చిప్స్‌ని తయారు చేసేది.
ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంప్యూటర్ల రంగంలో విప్లవమనే చెప్పాలి. ఈ విప్లవానికి కొంత కాలం కిందటే ఎన్విడియా సంస్థ మిషిన్ లెర్నింగ్‌ను ప్రాసెస్ చేసే చిప్స్‌లో మార్పులు చేసింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ క్వార్టర్లో 26 మిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు చేయగలిగింది. గతేడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు మూడు రెట్లు ఎక్కువ. దీంతో ఈ కంపెనీ విలువ ఉన్నట్లుండి భారీగా పెరిగిపోయింది.