మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ హంగామా స్టార్ట్ అయిపోయింది. మెగాభిమాని బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ కమిషనర్ ఆఫీసర్‌గా నటించాడు. అయితే వాల్తేరు వీరయ్యలో రవితేజ స్థానంలో ముందుగా మెగా హీరో తీసుకోవాలని అనుకున్నారట. కానీ జస్ట్ మిస్ అయిందని అంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా సాగుతున్న వరుణ్ తేజ్‌ను రవితేజ ప్లేస్‌లో తీసుకోవాలని అనుకున్నాడట దర్శకుడు బాబీ. వరుణ్ కూడా ఎట్టిపరిస్థితుల్లోను.. మెగాస్టార్‌తో ఛాన్స్ వదులుకోకూడదని ఫిక్స్ అయ్యాడట. అయితే చిరు మాత్రం.. ఎందుకో వరుణ్‌ను వద్దని చెప్పాడట.
గతేడాది వచ్చిన ఆచార్య సినిమాతో.. రామ్ చరణ్ కీ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అందుకే మరోసారి దాన్ని రిపీట్ చేయొద్దని భావించారట చిరు. దాంతో ఫైనల్‌గా రవితేజను లైన్లోకి తెచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. కారణాలు ఏమైనా.. వరుణ్ తేజ్,మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ మిస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇకపోతే.. వాల్తేరు వీరయ్య మెగా, మాస్ రాజా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు. వెండి తెరపై ఈ ఇద్దరిని చూసి.. పూనకాలు రావడం పక్కా అంటున్నారు. పైగా దేవిశ్రీ ప్రసాద్.. 250 రూపాయలతో గోవాలో కొనుకున్న బూరతో పూనకాలు లోడింగ్ సాంగ్ చేశాడంటే.. వాల్తేరు వీరయ్య ఎంత ఊరమాస్‌గా తెరకెక్కించారో అర్థం చేసుకోవచ్చు. మరి చిరు, రవితేజ ఎలాంటి విజువల్ ఫీస్ట్ ఇస్తారో చూడాలి.