గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు ప్రత్యక్ష ప్రసారం
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden) మరో సారి కిందపడ్డారు. కొలరాడోలోని యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ(US Air Force Academy)లో గురువారం జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుక(Graduation Ceremony)లో ఆయన పాల్గొన్నారు.
భారత(india) హాకీ జట్టు ఫైనల్లో మన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan)ను ఇండియా చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో 2-1 తేడాతో జూనియర్ ఆసియా కప్ టైటిల్‌ను ఇండియా కైవసం చేసుకుంది.
ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ ప్రింటెడ్(3D Printed) పద్ధతిలో ఆలయాన్ని(Temple) నిర్మిస్తున్నారు. అది కూడా ఎక్కడో కాదు మన తెలంగాణలోనే.. హైదరాబాద్(Hyderabad)కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్‌ఫ్రాటెక్(Apsuja Infratech) ఈ టెంపుల్ పనులు చేపట్టింది.
ఉక్రెయిన్ (Ukraine)తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తామన్న రష్యా(Russia) తీరు మార్చుకోలేదు. ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ శుక్రవారం మరోసారి దేశవ్యాప్తంగా ఎయిర్ రెడ్ అలర్ట్(Red Alert) ప్రకటించింది. అంటే రష్యా.. తమ దేశంలో ఎక్కడైనా క్షిపణుల(missiles)ను వదలగలదని ఉక్రెయిన్ ప్రకటించింది.
వేసవి(Summer)లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 7గంటల నుంచే సుర్రుమంటున్నాడు. 9దాటితే బయట అడుగు వేస్తే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు.
కర్ణాటకలోని మంగళూరు(Mangaluru) శివార్లలోని సోమేశ్వర్ బీచ్‌లో జరిగిన దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఇక్కడ తమ హిందూ మహిళా స్నేహితురాళ్లతో కాలక్షేపానికి వచ్చిన ముగ్గురు ముస్లిం విద్యార్థుల(Muslim students)పై ఆరుగురు దుండగులు దాడి చేశారు.
ఎన్నికల రాష్ట్రమైన రాజస్థాన్(Rajastan)లో ప్రభుత్వం ఇప్పుడు ప్రతినెలా 100 యూనిట్ల ఉచిత విద్యుత్(Free Current)ను ఇస్తామని ప్రకటించింది.
తెలంగాణ దశాబ్ది వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 21 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం నేటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగుపెడుతోంది.
పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ, పదవ వసంతంలోకి అడుగిడుతున్న చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల(Telangana state's birth decade celebrations)ను అత్యంత వైభవోపేతంగా జరుపుకునేందుకు రాష్ట్రం సిద్ధమైంది.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా దిబాయి తహసీల్‌లోని నరౌరా(Naraura)లో పురాతన మర్రి చెట్టు(oldest banyan tree)ను పరిశోధకులు కనుగొన్నారు. దీని కార్బన్ డేటింగ్(carbon dating) దాదాపు 450 ఏళ్ల నాటిదని తేలింది. ఈ పరిశోధనలో ఇప్పటివరకు కార్బన్ డేట్ చేయబడిన అన్ని మర్రి చెట్లలో ఇది పురాతనమైనది అని తేలింది.
ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guard) సముద్రంలో భారీగా బంగారాన్ని(gold) పట్టుకుంది. దాదాపు 33 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. సినిమాటిక్ స్టైల్లో కోస్ట్ గార్డ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది.
రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఆదిపురుష్ మూవీ. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ భారీగా అంచనాలను పెంచేశాయి. దాంతో ఆదిపురుష్‌కు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. అందుకు తగ్గట్టే.. తిరుపతిలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కనీవినీ ఎరుగని వధంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయట.
బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని-1 ట్రైనింగ్ పరీక్ష విజయవంతం అయ్యింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ గురువారం పేర్కొంది.
కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జీ బాధ్యతలను అప్పగించారు. దీంతో కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం గుర్రుగా ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా మాత్రం శివరాంను వెనకేసుకొని వస్తోంది.