• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి’

ADB: విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ యశోద అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని సరస్వతి నగర్‌లో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా పోషకాల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రక్తహీనతపై అవగాహన, నివారణ చర్యల గురించి వివరించారు.

December 10, 2024 / 05:13 PM IST

సిరాజ్- హెడ్ పరిపక్వత ఉన్న ఆటగాళ్లు: రవిశాస్త్రి

అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్-ట్రావిస్ హెడ్ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ప్రత్యర్థులు మనపై ఎంత తీవ్రంగా స్పందిస్తే.. అదే స్థాయిలో సమాధానం చెప్పాలని అభిప్రాయపడ్డాడు. అలాగే, ఇప్పటికే సిరాజ్- హెడ్‌ల వివాదం చల్లారిందని తెలిపాడు. దూకుడుగా ఉండటం సీమర్ల లక్షణం.. సిరాజ్ అదే చేశాడని పేర్కొన్నాడు.

December 10, 2024 / 05:12 PM IST

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని కలిసిన ఎంపీ కావ్య

WGL: వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర విమానాయాల శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని నేడు ఎంపీ కడియం కావ్య కలసి వినతి పత్రం సమర్పించారు. మామునూరులో ఏర్పాటు భూస్థల సేకరణ, విస్తరణ పనులపై చర్చించారు. విమాన రాకపోకలకు అనుమతులు ఇవ్వాలని కోరారు.

December 10, 2024 / 05:12 PM IST

పంటలకు తెగులు ఆశించకుండా రైతులు జాగ్రత్త వహించాలి

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం ముసునూరులో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఏడిఏ ఈవీ వెంకటరమణ పాల్గొని రైతులకు సూచనలు చేశారు. రైతులు సాగు చేసిన పంటలకు తెగుళ్లు సోకకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు సలహాలు పాటించాలని పేర్కొన్నారు. పంటల బీమాను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

December 10, 2024 / 05:10 PM IST

నిరసన దీక్షలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ASF: ఆసిఫాబాద్ జిల్లా విద్యా శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు మళ్లీ సమ్మెబాట పట్టారు. ఎన్నికలకు ముందు సమ్మెలో పాల్గొన్న వీరికి అప్పటి పీసీసీ అధ్యక్షుడి, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం బైఠాయించి సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టారు.

December 10, 2024 / 05:10 PM IST

‘గురుకుల సంక్షేమ హాస్టల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి’

SRPT: సంక్షేమ హాస్టల్లో గురుకులాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోట చలంకు పి.డి.ఎస్.యూ – పివైఎల్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగిందని పి.డి.ఎస్.యూ జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి తెలియజేశారు.

December 10, 2024 / 05:09 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హథ్రాస్‌లో కారు- కంటెయినర్ ఢీకొని ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 10, 2024 / 05:07 PM IST

‘మణిపూర్ క్రైస్తవులపై దాడులు అరికట్టాలని నిరసన’

కోనసీమ: మణిపూర్‌లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సీపీఐ రాజోలు ఏరియా కార్యదర్శి దేవ రాజేంద్ర ప్రసాద్ కోరారు. మణిపూర్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం సఖినేటిపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

December 10, 2024 / 05:06 PM IST

పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం చేయవద్దు: ఎంపీఓ

BDK: పినపాక మండలంలో పనిచేసే పంచాయతీ సెక్రెటరీలు పారిశుధ్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని మండల పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు మంగళవారంలో ఓ ప్రకటనలో కోరారు. ప్రతి పంచాయతీ సెక్రటరీ పారిశుధ్యంతో పాటు, వీధి దీపాల నిర్వహణ, మంచినీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచడం వంటి పనులను కచ్చితంగా చేయాలన్నారు. ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

December 10, 2024 / 05:05 PM IST

రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

NLR: ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును అమరావతిలోని సచివాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సర్వేపల్లి రిజర్వాయర్ ఆధునికీకరణ, డేగపూడి – బండేపల్లి కాలువ, కనుపూరు కెనాల్ పనులకు నిధులు మంజూరు చేయాలన్నారు. అలాగే త్వరితగతిన పనులు చేపట్టాలని కోరారు.

December 10, 2024 / 05:04 PM IST

మల్లెల గ్రామంలో నిర్వహించిన అధికారులు

నంద్యాల: నందికొట్కూరు మండలంలోని మల్యాల గ్రామంలో మంగళవారం రెవిన్యూ సర్వీసులు తాహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూములకు సంబంధించిన 14 మంది రైతులు అర్జెంట్ ఇచ్చారని డిప్యూటీ తాహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామని తాహసీల్దార్ తెలిపారు.

December 10, 2024 / 05:03 PM IST

శ్రీశైలం: ఇక నుంచి అన్ని వేళల్లో స్పర్శ దర్శనం

AP: శ్రీశైలం భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి వారి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. స్వామి వారి దర్శన వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.  గతంలో పండుగ వేళల్లో, రద్దీ సమయాల్లో స్వామి వారి స్పర్శ దర్శనం వెసులుబాటు ఉండేది కాదు. తాజాగా అన్ని వేళల స్పర్శ దర్శనం చేసుకునేలా ఆలయ ఈవో శ్రీనివాస రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా  ప్రకటించారు.

December 10, 2024 / 05:02 PM IST

‘విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం’

ADB: సోనాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ క్రీడా దుస్తులను మంగళవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి కనబరచాలన్నారు. పాఠశాల అభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందజేస్తానని పేర్కొన్నారు.

December 10, 2024 / 05:01 PM IST

‘చేనేత కార్మికుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’

BPT: చేనేత కార్మికుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. భట్టిప్రోలులోని రైల్ పేటలో మంగళవారం HWCS ఆధ్వర్యంలో 26మంది చేనేత లబ్దిదారులకు ప్రధాన మంత్రి ముద్ర యోజన స్కీమ్ కింద మంజూరైన రూ.13లక్షల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం చేనేతలకు అండగా ఉందన్నారు.

December 10, 2024 / 05:00 PM IST

గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

ASR: అరకు మండలం బీజగూడ, కొంత్రాయిగూడ, కంజరితోట గ్రామాల్లో నెలకొన్న రహదారి, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు గెమ్మెలి చిన్నబాబు డిమాండ్ చేశారు. మంగళవారం గిరిజన సంఘం నేతలతో కలిసి ఆయన ఆయా గ్రామాల్లో పర్యటించారు. అనంతరం గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రహదారులు, తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు.

December 10, 2024 / 04:59 PM IST