TPT: సత్యవేడు మండలం అమాసరెడ్డి కండ్రిగ సమీపంలో అడిషనల్ ఎస్సై లావణ్య ఆధ్వర్యంలోని బృందం తనిఖీలు నిర్వహించింది. అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 1500 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాయుడుపేటకు చెందిన మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.