• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మీకోసం కార్యక్రమంకు 75 ఫిర్యాదులు

ప్రకాశం: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా సోమవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీగా మాట్లాడి వారి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. మీకోసం కార్యక్రమంకు 75 ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు.

February 23, 2026 / 07:00 PM IST

ఏసీబీ వలలో ఎంఈవో

SKLM: ఇచ్చాపురం ఎంఈవో అప్పారావు ఏసీబీ వలలో చిక్కారు. రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ ఫైల్ క్లియర్ చేయడానికి రూ.30,000 డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముందస్తు సమాచారంతో రూ.10,000 లంచం స్వీకరిస్తుండగా ఎంఈవోను రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ సోమవారం తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

February 23, 2026 / 07:00 PM IST

కేటిదొడ్డి తహశీల్దార్‌కు సన్మానం

GDWL: కేటిదొడ్డి మండల నూతన తహసీల్దార్ కరుణాకర్‌ను ఎంఆర్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా సన్మానించారు. మండలంలో పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత సమస్యలు, భూభారతి పనులను త్వరగా పరిష్కరించాలని కోరారు. స్పందించిన తహసీల్దార్, ప్రతి సమస్యను పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

February 23, 2026 / 06:59 PM IST

CM కప్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

HNK: JNS స్టేడియంలో CM కప్ ముగింపు కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని క్రీడాకారులకు బహుమతి ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి క్రీడాకారులను గుర్తించి జాతీయ స్థాయికి పంపించేందుకు సీఎం CUP ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, అధికారులు పాల్గొన్నారు.

February 23, 2026 / 06:59 PM IST

కలెక్టర్ ప్రజావాణిలో 50 ఫిర్యాదులు: సంతోష్

NGKL: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయంతో కలిసి 50 అర్జీలను స్వీకరించారు. అందిన దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

February 23, 2026 / 06:58 PM IST

‘ఫీజులు చెల్లించకపోయిన హాల్ టికెట్స్ ఇవ్వాల్సిందే’

RR: విద్యార్థులు ఫీజులు చెల్లించకపోయిన కచ్చితంగా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలని AISF రంగారెడ్డి జిల్లా సహాయకార్యదర్శి శివకుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలు ఫీజులు కట్టలేదని సాకుతో ఈ పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని, హాల్ టికెట్స్ జారీ చేయాలన్నారు.

February 23, 2026 / 06:57 PM IST

అంగరలో వైసీపీ నుండి జనసేనలో చేరికలు

కోనసీమ: కపీలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన పలువురు సోమవారం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి లీలాకృష్ణ జనసేన కండువాను కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అంకితభావంతో పనిచేసి మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలపరచేందుకు కృషి చేయాలని సూచించారు

February 23, 2026 / 06:57 PM IST

కలెక్టరేట్ కార్యాలయం ముందు జర్నలిస్టుల ధర్నా

RR: అక్రిడిటేషన్ కార్డులలో కోత విధించడంపై RR జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరై ధర్నా చేపట్టారు. జర్నలిస్టులకు ఉన్న ఒక్క గుర్తింపు కార్డును తొలగిస్తే వారికి ప్రయోజనం ఏముంటుందన్నారు. గతంలో అర్హత లేనివారికి కార్డులు ఇవ్వమంటూ ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు అర్హత ఉన్న వారిని సైతం పక్కన పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.

February 23, 2026 / 06:56 PM IST

చంద్రబాబు కావాలనే కుట్ర చేశారు: అంబటి

AP: తన ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు పట్టించుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సీఎం చంద్రబాబు కావాలనే తనపై కుట్రచేశారని మండిపడ్డారు. ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టింది వారు కాదా అని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి తనది కాదని వెల్లడించారు. తన ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 06:56 PM IST

వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన పోస్టర్స్ ఆవిష్కరణ

ATP: జిల్లాలో వెట్టి చాకిరిని పూర్తిగా రూపం మాపాలని, ఎక్కడైనా ఇలాంటి కేసులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. అనంతరం వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన చట్టం 1976పై సామర్థ్యత పెంపుదలపై సదస్సు నిర్వహించారు.

February 23, 2026 / 06:55 PM IST

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

SRD: వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం డీపీఓ జానకి రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ.. కార్మికుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

February 23, 2026 / 06:55 PM IST

కల్తీ పాల ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి: గౌని ప్రతాపరెడ్డి

అనంతపురం: రాజమండ్రిలో కల్తీ పాలఘటన తీవ్ర భయాందోళనకు గురి చేసిందని, దోషులను కఠినంగా శిక్షించాలని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గౌని ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మీడియాకి ఆయన ప్రకటన విడుదల చేశాడు. విషపు పాలు తాగి రెండు రోజుల్లో నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

February 23, 2026 / 06:54 PM IST

‘శిశువుల మిస్సింగ్ ఘటనకు, ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదు’

PDPL: పెద్దరాత్ పల్లిలో మిస్సింగ్ అయిన పిల్లలు తల్లిదండ్రుల వద్దనే ఉన్నారని DCHS డా. శ్రీధర్ తెలిపారు. శిశువులను, తల్లిదండ్రులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టామన్నారు. శిశువుల సంరక్షణ నిమిత్తం KNR శిశుగృహకు తరలించామని, సంఘటనపై పూర్తి విచారణ చేయడానికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సంఘటనకు మాతా శిశు ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

February 23, 2026 / 06:53 PM IST

‘ప్రజా రక్షణకు ఆర్మ్డ్ పోలీస్ సేవలు అవసరం’

SKLM: ప్రజలకు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల విధులు, సేవలు అత్యంత అవసరమని అదనపు శ్రీకాకుళం జిల్లా అడిషనల్ ఎస్పీ కెవి రమణ అన్నారు. సోమవారం ఎచ్చర్ల పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల 14 రోజుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఈ శాఖ ఆవశ్యకతను ఆయన తెలిపారు.

February 23, 2026 / 06:52 PM IST

ఎమ్మెల్యేకు మొదటి ఆహ్వాన పత్రిక అందజేత

RR: ఈనెల 26,27,28 తేదీల్లో షాద్ నగర్ పట్టణంలోని శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మొదటి ఆహ్వాన పత్రికను వారికి అందజేశారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన సంఘాల నాయకులు పాల్గొనాలన్నారు.

February 23, 2026 / 06:50 PM IST