ATP: గుంతకల్లు పట్టణంలోని ప్రధాన సర్కిల్లో ఈనెల 12న జరిగే హనుమత్ వ్రత్ ఉత్సవాల సందర్భంగా దీక్షాపరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపాలిటీ అధికారులు ఈనెల 8న తొలగించారు. దీంతో దీక్షాపరులు మున్సిపాలిటీ అధికారులతో వాగ్వివాదానికి దిగి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అధికారులు తొలగించిన ఫ్లెక్సీల స్థానంలో మంగళవారం నూతన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
KDP: విద్యాసంస్థల మాటునా భూ దోపిడి చేస్తూ, చెరువులను స్వాహా చేస్తున్న రాజంపేట అన్నమాచార్య విద్యాసంస్థలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, TNSF జిల్లా అధ్యక్షుడు పోలి శివకుమార్ తెలిపారు. మంగళవారం రాజంపేటలో వారు మాట్లాడుతూ.. చెరువు తొట్టిలను కబ్జా చేసి భవనాలు నిర్మించారని ఆరోపించారు.
ప్రకాశం: ఈ పంట నమోదు తప్పని సరిగా చేయించుకోవాలని అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకులు కె ధనరాజ్ అన్నారు. మనికేశ్వరం మరియు కొంగపాడు గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15 లోపు అందరూ పంటల భీమా చేయించుకోవాలని అన్నారు.
సిరియాలో ఇజ్రాయెల్ పెద్దఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది. అదేవిధంగా.. సిరియాలోకి ఇజ్రాయెల్ సైనికులు చొచ్చుకుని వెళ్తున్నట్లు సమాచారం. సిరియా రాజధాని డమాస్కస్‌కు 25 కిలోమీటర్ల పరిధి వరకు వెళ్లినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ వెల్లడించింది. ఈ ఘటనలో క్షిపణి లాంచర్లు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు పేర్కొంది.
VZM: అంగన్వాడి కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను మరింత పటిష్టంగా నిర్వహించాలని మంగళవారం మధ్యాహ్నం గంట్యాడలో ఐసీడీఎస్ పీవో ఉమాభారతి ఆదేశించారు. గంట్యాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల వివిధ మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం జరిగింది. బాల్య వివాహాలు జరగకుండా నిరోధించడం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
NZB: సదాశివ్ నగర్ చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి అన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో చట్టాలపై మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గృహహింస, బాల్యవివాహాల నిర్మూలన చట్టాలపైన అవగాహన కల్పించారు. ప్రతినిధులు షేక్ అలీమ్, అబ్దుల్ లతీఫ్, ఐకెపి ఎపిఎం రాజిరెడ్డి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
TPT: రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మహిళలు మామోగ్రామ్ వైద్య పరీక్షలు చేయించుకోవాలని స్విమ్స్ ఆంకాలజీ వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య భాను సూచించారు. మంగళవారం రాజగోపాలపురం, పీవీ పురం గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య పరీక్ష శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నపాండూరు వైద్యాధికారి డాక్టర్ అనిత, గ్రామ సర్పంచులు మధుసూదన్ రావు, పోలమ్మ పాల్గొన్నారు.
KNR: మెట్పల్లి మండలంలోని వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నట్లు ఆర్డర్ వెలుపడగా, మంగళవారం ఆలయాన్ని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ ఆధ్వర్యంలో అధికారులు ఆలయాన్ని పరిశీలించి స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆలయాన్ని ఎండోమెంట్లోకి పరిగణించవద్దని అధికారులను అడ్డుకున్నారు.
అన్నమయ్య: జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేశ్ కృషితో రాజంపేటలో కన్యాకుమారి స్టాపింగ్ వచ్చిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్ అన్నారు. ఒక రోజు ముందే మంగళవారం ట్రయిల్ కోసం రాజంపేటలో ట్రైన్ ఆగిందని ఆయన తెలిపారు. రైల్వే మంత్రి, సికింద్రాబాద్ రైల్వే నిలయం మేనేజర్ పద్మజను కలిసి లోకేశ్ పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో ఆయన కృషి ఫలించిందని చెప్పారు.
ATP: రొంపిచర్ల మండలం పెద్ద గొట్టిగల్లు గ్రామపంచాయతీలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో భారీగా భూ అక్రమాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, సమస్యను పరిష్కరించుకోవచ్చని చెప్పారు.
NLR: స్వేచ్ఛ స్వతంత్రంగా బ్రతకడం ప్రతి మనిషి జన్మహక్కు అని ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ చేవూరు చిన్న అన్నారు. కావలి పట్టణంలోని ముసునూరు చంద్రబాబు నగర్ అంగన్వాడీ కేంద్రంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పై మహిళలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. జాతి, రంగు, మతం, లింగం, భాష, రాజకీయ తేడా లేకుండా అందరూ సమాన హక్కులతో జీవించాలన్నారు.
ASR: కొయ్యూరు మండలంలోని పిట్టచలం గ్రామంలో జాతీయ రహదారి మధ్యలో పిక్కరాయి (చిప్స్) వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ మండల కార్యదర్శి ఇరవాడ దేముడు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి మధ్యలో అడ్డంగా పిక్కరాయి లోడు వేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే పిక్కరాయి గుట్టను తొలగించాలని కోరారు.
TPT: గూడూరు ఏపీఎస్‌ఆర్టీసీ డిపో ఎదుట కండక్టర్, డ్రైవర్లు, అక్రమ సస్పెన్షన్‌లను రద్దు చేయాలని CITU అనుబంధం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమం మంగళవారానికి ఆరవ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి కె.ఎస్.వాసులు అధ్యక్షత వహించడం జరిగింది. వెంటనే అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేసి తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
KDP: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని తహశీల్దార్ నజీర్ అహ్మద్ అన్నారు. మంగళవారం పులివెందుల మండలం రాగిమాను పల్లెతో పాటు పులివెందుల పట్టణంలోని బాకరాపురం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ సదస్సులో ప్రజలు ఇచ్చిన వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా చూస్తామన్నారు.
NRML: అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి సురేష్ అన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఐసీడీఎస్ కార్యాలయంలో ఏపీడీకి వినతి పత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. అంగన్వాడి టీచర్ల సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 12న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.