ఏలూరు: సత్రంపాడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఈనెల 24న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఐదు ప్రముఖ కంపెనీలు పాల్గొనే ఈ మేళాకు టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన 18-35 ఏళ్ల వారు అర్హులని ప్రిన్సిపల్ భూషణం తెలిపారు. అభ్యర్థులు తమ బయోడేటాతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.