• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లాకు బెస్ట్ ప్రాక్టీసింగ్ అవార్డు

NRPT: రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాకు బెస్ట్ ప్రాక్టీసింగ్ అవార్డు లభించిందని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు తెలిపారు. FLN AI AXL కార్యక్రమాన్ని జిల్లాలోని పాఠశాలలో సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా అవార్డు లభించిందన్నారు. గణన సామర్థ్యాల బలోపేతం దిశగా జిల్లాలో ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టడంతో అవార్డు సాధ్యమైందని అన్నారు.

February 28, 2026 / 08:34 PM IST

పెదకూరపాడులో బాల్య వివాహాలపై అవగాహన

PLD: పెదకూరపాడు అంగన్వాడీ 3వ సెంటర్‌లో శనివారం బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. icds ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి హెచ్ఎం రమణ పాల్గొన్నారు. చిన్న వయసులో పిల్లలకు పెళ్లి చేయడం ద్వారా గర్భం దాల్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. పిండం అభివృద్ధి చెందక అంగవైకల్యం కలిగిన బిడ్డలు పుట్టే అవకాశం ఉందన్నారు.

February 28, 2026 / 08:33 PM IST

బుసిరెడ్డిపల్లిలో సైన్స్ దినోత్సవం

WNP: సీవీ రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుసిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ విద్య ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. సైన్స్ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 28, 2026 / 08:32 PM IST

‘అటవీ అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం’

MLG: వాజేడు మండలం పెనుగోలు కాలనీ పుసురు బీట్ పరిధిలో శనివారం అటవీశాఖ ఆధ్వర్యంలో వేసవి కాలంలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు గ్రామస్థులకు అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని సూచించారు.

February 28, 2026 / 08:31 PM IST

‘వైద్యులపై దాడులు ఆపాలి’

KNR: HYDలోని రెండు ఆసుపత్రుల్లో రోగి మృతికి వైద్యులే కారణమంటూ బంధువులు ఆసుపత్రి సిబ్బంది, సామగ్రిపై దాడి చేసిన ఘటనను ఖండిస్తూ జమ్మికుంట, హుజురాబాద్ ఐఎంఏ ఆధ్వర్యంలో జమ్మికుంటలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ.. ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అహర్నిశలు కృషి చేస్తారని, అనూహ్య మరణాలపై దాడులు చేయడం సరైంది కాదన్నారు.

February 28, 2026 / 08:31 PM IST

వృద్ధులు అండగా లీగల్ ఎయిడెడ్ క్లినిక్‌లు

SKLM: పట్టణంలోని ప్రశాంతి ఓల్డ్ ఏజ్ హోమ్‌ ను జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ ఛైర్మన్ కె. హరిబాబు, ఆర్డీవో సాయి ప్రత్యూష శనివారం సందర్శించారు. ఈ మేరకు వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఛైర్మన్ హరిబాబు మాట్లాడుతూ, ప్రజలు తమ తమ రంగాల్లో ఎదుర్కొంటున్న న్యాయపరమైన ఇబ్బందుల నుంచి బయటపడేందుకు లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల‌ను వినియోగించుకోవాలన్నారు.

February 28, 2026 / 08:30 PM IST

సబ్‌ కలెక్టరేట్‌కు వినతి పత్రం అందజేత

NZB: ఒకవైపు ప్రకృతి కన్నెర్ర.. మరోవైపు ప్రభుత్వ ఉదాసీనతతో రైతాంగం అల్లాడిపోతోందని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్, నడిపి నాగన్న ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం బోధన్ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. డివిజన్ వ్యాప్తంగా నెలకొన్న సాగు సమస్యలను వివరించారు.

February 28, 2026 / 08:30 PM IST

‘మూడు నెలల్లో పీఎం సూర్యఘర్ లక్ష్యాలు పూర్తి చేయాలి’

విశాఖ జిల్లాలో పీఎం సూర్యఘర్ యోజన అమలను వేగవంతం చేసి మూడు నెలల్లో లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో డీఆర్‌డీఏ, యూసీడీ గ్రూపుల ద్వారా లబ్ధిదారులకు అవగాహన కల్పించి బ్యాంకు రుణాలు, కేంద్ర రాయితీలు అందేలా చూడాలన్నారు. సమావేశంలో జేసీ విద్యాధరి పాల్గొన్నారు.

February 28, 2026 / 08:30 PM IST

పాప మృతికి కొవ్వొత్తులతో నివాళి

NLG: కుమ్మెరలో అగ్రకుల అహంకారానికి బలైన పసిపాప మృతికి DYFI ఆధ్వర్యంలో నల్గొండ, క్లాక్ టవర్ వద్ద ఇవాళ కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. నిమ్న కులస్తులనే నెపంతో దర్శనానికి అడ్డుపడి, బాధితులపై దాడి చేసి రెండు నెలల పాప మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ డిమాండ్ చేశారు.

February 28, 2026 / 08:29 PM IST

కార్పొరేషన్ ఎన్నికలపై BRS కీలక నిర్ణయం

TG: కార్పొరేషన్ ఎన్నికల కోసం BRS అధిష్టానం నేతలకు బాధ్యతలు అప్పగించింది. పార్టీ కార్యక్రమాలు, నేతలకు సంబంధించిన కార్యకలాపాల సమన్వయం కోసం బాధ్యతలు ఇచ్చింది. దాసోజు శ్రావణ్, కర్నె ప్రభాకర్‌ GHMC బాధ్యతలు చేపట్టనున్నారు. MLC శంభీపూర్ రాజుకు మల్కాజ్‌గిరి కార్పొరేషన్ బాధ్యతలు, MLC పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించింది.

February 28, 2026 / 08:29 PM IST

విద్యార్థుల ప్రతిభకు వేదికగా సైన్స్ ఫేర్

KRNL: ఆదోనిలోని సరస్వతి శశి మందిర్ స్కూల్లో ఇవాళ నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. టీడీపీ యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు పాల్గొని విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

February 28, 2026 / 08:29 PM IST

ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థినిలకు అవగాహన

HNK: ఆత్మకూరు మండలం తిరుమలగిరి సమీపంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై విద్యార్థినిలు అవగాహన కలిగి ఉండి తల్లిదండ్రులకు సూచనలు చేయాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు.

February 28, 2026 / 08:28 PM IST

నాయనపల్లి మైసమ్మ జాతరపై పోలీసులు అలర్ట్

NGKL: జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నాయనపల్లి జాతర సందర్భంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆదివారం జాతర నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పెద్దకొత్తపల్లి ఎస్సై సతీష్ కుమార్ ఆధ్వర్యంలో డివిజన్ పోలీసులు మోహరించారు.

February 28, 2026 / 08:28 PM IST

తొర్రూరులో ఘనంగా C.V రామన్ జయంతి వేడుకలు

MHBD: తొర్రూర్ పట్టణ కేంద్రంలోని వికాస్ కళాశాలలో మేర యువ భారత్ వరంగల్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం సి.వి. రామన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోఆర్డినేటర్ నవిన్ యాదవ్ మాట్లాడుతూ.. సి.వి. రామన్ ఆవిష్కరణలతోనే ప్రపంచం ముందుకు సాగుతోందని, యువత కూడా కొత్త ఆవిష్కరణల్లో భాగస్వామ్యం కావాలని, నిరంతరం ఆవిష్కరణ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

February 28, 2026 / 08:27 PM IST

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తాం: మంత్రి

NDL: ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని టెక్కే పురపాలక పాఠశాలను ఆయన శనివారం పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. TDP హయాంలో పాఠశాలలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.

February 28, 2026 / 08:27 PM IST