ప్రకాశం: ప్రజల ఆర్థిక భద్రతను కాపాడడమే లక్ష్యంగా గిద్దలూరు లోని ఏటీఎం కేంద్రాల్లో సీఐ సురేష్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా సీసీ కెమెరాల పనితీరు, అలారం వ్యవస్థలు, రాత్రి వేళల్లో లైటింగ్ , సెక్యూరిటీ గార్డుల లభ్యతను తనిఖీ చేశారు. ఏటీఎం మిషన్లకు స్కిమ్మింగ్ పరికరాలు అమర్చడం వంటి మోసాలను అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకు అధికారులకు సూచించారు.